గత నెలలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ఓ నగర పౌరుడి అభ్యర్థన మేరకు గత నెల 29వ తేదీ నుంచి ట్యాంక్‌బండ్‌పై సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సండే-ఫండే నిర్వహిస్తూ సందర్శకులను అనుమతిస్తుండగా…అది చాలా సక్సెస్ అయింది. తాజాగా హైదరాబాద్ నగర ప్రజలు ట్యాంక్‌బండ్‌పై ఆహ్లాదకరమైన వాతావారణంలో ఇంకాస్త ఎక్కువ సమయం గడిపేందుకు ఈ ఆదివారం నుంచి ట్రాఫిక్ ఆంక్షల సమయాన్ని పెంచుతున్నారు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్‌బండ్‌పైకి వాహనాల రాకపోకలు నిషేధిస్తూ, ఆ సమయంలో కేవలం సందర్శకులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. దీంతో సందర్శకులు ఆదివారం పగటి వేళల్లో కూడా మరింత సమయం ట్యాంక్‌బండ్‌పై గడిపేందుకు అవకాశముంటుందని, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు కొద్దిసేపు ట్యాంక్‌బండ్ పరిసరాలలో గడిపేందుకు సమయం కలిసి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ట్యాంక్‌బండ్ పై జరిగే సండే-ఫండే కు వచ్చే సందర్శకుల కోసం అంబేద్కర్ విగ్రహం వైపు నుంచి వచ్చే వారు తమ వాహనాలను లేపాక్షి వద్ద, రాణిగంజ్ వైపు నుంచి వచ్చే వారు చిల్డ్రన్ పార్కు వద్ద, ట్యాంక్‌బండ్‌కు ఇరువైపుల పార్కింగ్ చేసుకునే విధంగా ఇప్పటికే పార్కింగ్ స్థలాలను కేటాయించారు. సాధారణ వాహనదారులు ఆదివారం మూడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ట్యాంక్‌బండ్‌కు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.
- Hyderabad Metro phase-2 stuck in limbo: Should the centre or state be blamed?
- RBI’s latest report highlights Telangana’s remarkable progress under KCR’s rule
- BRS stands firm in Bhopal court against Som distilleries and Congress government
- KCR left an indelible mark on agriculture: KTR quotes RBI’s handbook of statistics
- Did crop loan waiver cheques distributed by Revanth become void?
- సమగ్ర శిక్ష ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది: హరీష్ రావు
- 8 మంది బీజేపీ ఎంపీలు బయ్యారం ఉక్కు పరిశ్రమపై స్పందించకపోవడం శోచనీయం: కవిత
- ప్రకటనలు కాదు.. పథకాల అమలు కావాలి.. కోతలు, కూతలు కాదు.. చేతలు కావాలి: కేటీఆర్
- తెలంగాణ బతుకు ఛిద్రమవుతుంటే ప్రేక్షకపాత్ర వహిస్తారా?: రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
- నీళ్ళు ఇవ్వలేము యాసంగి పంట తక్కువ వేసుకోవాలని అధికారులు చెప్తున్నారు: వినోద్ కుమార్
- స్పీకర్ వ్యవహార శైలికి నిరసనగా శాసనసభ్యుల ఓరియంటేషన్ సెషన్‌ను బహిష్కరిస్తున్నాం: కేటీఆర్
- తన బాస్‌లను సంతృప్తి పరిచేందుకే రేవంత్ నిన్న కొత్త తల్లిని సృష్టించాడు: జగదీశ్ రెడ్డి
- విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా?: హరీష్ రావు ధ్వజం
- తెలంగాణ ఆస్తిత్వాన్ని, వారసత్వాన్ని, ప్రజల భావోద్వేగాలను కేవలం ఒక జీవోతో మార్చలేరు: కవిత
- హంతకులే సంతాపం చెప్పినట్లు తెలంగాణ తల్లిపైన కూడా కాంగ్రెస్ కుట్రలు చేస్తుంది: కేటీఆర్