mt_logo

గల్వాన్ అమరులకు ఆర్థిక సహాయం అందించేందుకు సీఎం కేసీఆర్ జార్ఖండ్ పయనం

ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం జార్ఖండ్‌ రాజధాని రాంచీకి వెళ్లనున్నారు. గతేడాది గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు పది లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నారు. రాంచీలో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తోపాటు జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరెన్‌ కూడా పాల్గొంటారు. రెండేళ్ల క్రితం భారత్ లోని గల్వాన్ లోయలో పట్టు సాధించడానికి చైనా సైనికులు భారత సైనికులతో ఘర్షణకు దిగగా… తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ కుమార్ తోపాటు, మరో 19 మంది సైనికులు అమరులయ్యారు. దేశంకోసం ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలకు ఒక భారతీయుడిగా అండగా ఉంటానని సీఎం కేసీఆర్‌ ఆరోజు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున అమరజవాన్ల ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్ధిక సహాయం అందించనున్నారు. ఈ 19 మంది సైనికుల్లో ఇద్దరు జార్ఖండ్‌కు చెందినవాళ్లున్నారు. వీరి కుటుంబ సభ్యులకు రాంచీలో జరిగే కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ స్వయంగా చెక్కులను అందజేస్తారు. ఈ మేరకు రాంచీలో జరిగే కార్యక్రమాన్ని సమన్వయంచేయడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు హర్విందర్‌సింగ్‌, రిజ్వీ గురువారం బయలుదేరి వెళ్లారు. శుక్రవారం రాంచీకి సీఎం కేసీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ తదితరులు వెళ్లనున్నట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *