mt_logo

సర్వాయి పాపన్న గౌడ్ కు ఘన నివాళులర్పించిన సీఎం కేసీఆర్

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి (ఆగస్ట్ 18) సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు ఘన నివాళులర్పించారు. తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక, సబ్బండ వర్గాల ఆత్మగౌరవ స్ఫూర్తి సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆనాటి సమాజంలో నెలకొన్న నిరంకుశ రాజరిక పోకడలకు వ్యతిరేకంగా సబ్బండ వర్గాలను ఏకం చేసి, పాపన్న పోరాడిన తీరు గొప్పదని సీఎం అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ.. బడుగు, బలహీనవర్గాల నాయకత్వాన్ని సముచితంగా గౌరవించుకుంటున్నదని అన్నారు. అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పాపన్న గౌడ్ ప్రదర్శించిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తిని తెలంగాణ రాష్ట్రం కొనసాగిస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *