mt_logo

అభివృద్ధిలో తెలంగాణ అగ్రస్థానం : సీఎం కేసీఆర్

అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పబ్లిక్‌ గార్డెన్‌లో నిర్వహించగా… ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎనిమిదేళ్ల స్వల్పకాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని విశ్లేషించుకుంటే… 75 సంవత్సరాల్లో దేశంలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను 8 ఏళ్లలో మన తెలంగాణ రాష్ట్రం సాధించిందన్నారు. ప్రతి విషయంలో తెలంగాణ రాష్ట్రం అవతరించే నాటికి.. నేటి స్థితిగతులకు పోలికే లేదన్నది జగమెరిగిన సత్యం. ఆర్థికవృద్ధిలో, తలసరి ఆదాయం పెరుగులలో, విద్యుత్‌ సరఫరా, తాగు, సాగునీటి సదుపాయం, ప్రజాసంక్షేమం, పారిశ్రామిక, ఐటీ రంగాలతో పాటు అనేక రంగాల్లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలువడం మనందరికీ గర్వకారణం.

అస్థిత్వం కోసం 60 సంవత్సరాలు పోరాడిన తెలంగాణ నేడు అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరి నేడు ప్రపంచం ముందు సగర్వంగా నిలిచిందన్నారు. ఎనిమిదేళ్ల స్వల్పకాలంలో దేశానికే దిశానిర్దేశం చేసే కరదీపగా మారిందని, ప్రజలందరి దీవెన, ప్రభుత్వ సిబ్బంది అంకితభావం వల్లనే ఇదంతా సాధ్యపడిందన్నారు. కఠిన, పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో ఆదాయ వనరులను పెంచుకున్నాం. 2014-2019 వరకు 17.24శాతం సగటు ఆర్థిక వృద్ధిరేటుతో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. కరోనా సృష్టించిన సంక్షోభం నుంచి అతిత్వరగా తెలంగాణ కోలుకున్నదని భారత ఆర్థిక సర్వే 2020-21 అభినందించడం.. తెలంగాణ ఆర్థిక నిర్వహణ దక్షతకు దక్కినటువంటి గుర్తింపు అని, 2013-14లో తెలంగాణ ఏర్పడిన నాడు రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.5,05,849 కాగా… 2021-22 నాటికి రూ.11,54,860కోట్లకు చేరింది. పెరిగిన ఆదాయంలో ప్రతి పైసా సద్వినియోగమయ్యే విధంగా ప్రభుత్వం జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా పెట్టుబడి వ్యయం చేస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *