తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకరరాశిలోకి సూర్యుని ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమని.. ప్రజలు సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో తులతూగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. స్వరాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసుకోగలిగామని, పంటపెట్టుబడి సాయం, పలు రైతు సంక్షేమ పథకాలు, పటిష్ట చర్యలతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో నిత్య సంక్రాంతిని నెలకొల్పిందని సీఎం అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణలో వ్యవసాయం అనుబంధ రంగాలలో పండుగ వాతావరణం నెలకొల్పామన్నారు. తెలంగాణ వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిలాగే అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఎన్ని కష్టాలెదురైనా సమర్థవంతంగా ఎదుర్కుంటామని, రైతుల జీవితాల్లో నిత్య సంక్రాంతులను కొనసాగించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ, సంక్రాంతి పండుగను పచ్చదనం నడుమ ఆనందంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు.
- Stunning clicks of rich wildlife in HCU
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!
- రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుంది: కేసీఆర్