రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న ఓట్ ఆన్ అక్కౌంట్ బడ్జెట్ లో ప్రతి పైసకూ లెక్కుండాలని, రాబోయే ఐదేళ్ళను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. శాసనసభలో ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్ పై సోమవారం ఆర్ధిక శాఖ అధికారులతో సీఎం శ్రీ కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. గత తొమ్మిది నెలలుగా రాష్ట్రానికి సొంత పన్నుల ద్వారా వచ్చిన గ్రాంట్లు, పన్నుల వాటా, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సొంత పన్నుల రాబడిలో 19 శాతానికి పైగా వృద్ధిరేటు నమోదు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. వివిధ శాఖల నుండి వచ్చిన బడ్జెట్ ప్రతిపాదనలను కూడా సీఎం పరిశీలించారు. ఈ సమీక్షలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.