mt_logo

1,82,017 కోట్లతో తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్!!

ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆర్ధికమంత్రిగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగాన్ని సీఎం కేసీఆర్ గంటకుపైగా చదివి వినిపించారు. తెలంగాణ ఆవిర్భవించినప్పుడు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి నాలుగున్నరేండ్లలో అద్భుత విజయాలు సాధించాం. అత్యధికంగా సంక్షేమ పథకాలు పెట్టిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ సృష్టించింది. నిరుపేదలకు గృహ నిర్మాణ పథకంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం కింద ఇప్పటివరకు 2,72,763 ఇళ్ళను మంజూరు చేశాం. ఇళ్ళు కట్టుకునేవారికి ఆర్ధికసాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 340 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తాం. ప్రస్తుతమున్న రహదారులకు పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేయాలని నిర్ణయించాం.

విద్య, వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుంది. ప్రతీ పదివేల మందికి ఒక బస్తీ దవాఖాన ఏర్పాటు చేస్తాం. పేదలకు మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రుల్లో వసతులన్నీ మెరుగుపరిచాం. ఆస్పత్రుల్లో మందుల కొనుగోలు కోసం నిధుల్ని మూడింతలు పెంచాం. అత్యుత్తమ వైద్య సేవలందించే మూడు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని కేంద్రం ఇటీవలే ప్రకటించింది. వచ్చే సంవత్సరం నుండి బీసీల కోసం మరో 119 గురుకులాలు ప్రారంభం. గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై సగటున లక్ష రూపాయలు వెచ్చిస్తున్నాం. విద్యుత్ సంక్షోభాన్ని తెలంగాణ చాలా తక్కువ సమయంలో పరిష్కరించింది. మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు కొత్త ప్లాంట్ల నిర్మాణం జరుగుతోంది. దేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తిలో మన రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. విద్యుత్ వినియోగం వృద్ధి రేటులో మన రాష్ట్రం అగ్రభాగాన నిలవడం గర్వకారణం. ఏప్రిల్ చివరినాటికి మిషన్ భగీరథ పనుల్ని వందశాతం పూర్తి చేస్తాం. మరో రెండు నెలల్లో ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీళ్ళు అందిస్తాం.

2019-20 లో సొంత రెవెన్యూ రాబడుల అంచనా రూ. 94,776 కోట్లు

2019-20 లో కేంద్రం నుండి వచ్చే నిధుల అంచనా రూ. 22,835 కోట్లు

2019-20 లో ప్రగతి పద్దు రూ. 1,07,302 కోట్లు

నిర్వహణ పద్దు రూ. 74,715 కోట్లు

పంచాయితీలకు 2 ఫైనాన్స్ కమిషన్ల నుండి రూ. 3,256 కోట్లు. ఒక్కో మనిషికి రూ. 1,606 చొప్పున ఫైనాన్స్ కమిషన్ నిధులు.. 500 జనాభా కలిగిన గ్రామానికి రూ. 8 లక్షల నిధులు.

టీఎస్ఐపాస్ ద్వారా రూ. 1.41 లక్షల కోట్ల పెట్టుబడులు.. టీఎస్ఐపాస్ ద్వారా 8,419 పరిశ్రమలకు అనుమతులు. పరిశ్రమల ద్వారా 8.58 లక్షల ఉద్యోగాలు వచ్చాయి.

వ్యవసాయ శాఖకు రూ. 20,107 కోట్లు.. నీటిపారుదల శాఖకు రూ. 22,500 కోట్లు.

ఈఎన్టీ, దంత పరీక్షల కోసం రూ. 5,536 కోట్లు

రైతు బంధు కోసం రూ. 12 వేల కోట్లు.. రైతు రుణమాఫీ కోసం రూ. 6 వేల కోట్లు.. రైతు భీమా కోసం రూ. 650 కోట్లు.. 2018 డిసెంబర్ 11 నాటికి ఉన్న రూ. 1 లక్ష వరకు పంట రుణాలు మాఫీ..

బియ్యం రాయితీ కోసం రూ. 2,744 కోట్లు.. ఎంబీసీ కార్పొరేషన్ కోసం రూ. వెయ్యి కోట్లు.. షెడ్యూల్ తెగల ప్రగతి నిధి కోసం రూ. 9,827 కోట్లు.. షెడ్యూల్ కులాల ప్రగతి నిధి కోసం రూ. 16,581 కోట్లు.. మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,004 కోట్లు..

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం రూ. 1,450 కోట్లు.. నిరుద్యోగ భ్రుతి కోసం రూ. 1,810 కోట్లు.. ఆసరా పించన్ల కోసం రూ. 12,067 కోట్లు..

2017-18 ఆర్ధిక సంవత్సరంలో వృద్ధిరేటు 10.4 శాతం.. 2017-18 లో మొత్తం వ్యయం రూ. 1,43,133 కోట్లు.. 2017-18 లో రెవెన్యూ మిగులు రూ. 3,459 కోట్లు.. 2018- 19 సంవత్సరం అంచనా వ్యయం రూ. 1,61,857 కోట్లు.. 2018-19 ఆర్ధిక సంవత్సరానికి రూ. 1,82,017 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్

రెవెన్యూ వ్యయం రూ. 1,31,629 కోట్లు.. మూలధన వ్యయం రూ. 32,815 కోట్లు.. రెవెన్యూ మిగులు రూ. 6,564 కోట్లు.. ఆర్ధిక లోటు రూ. 27,749 కోట్లు ఉంటుందని అంచనా. 2018-19 ఆర్ధిక సంవత్సరం వృద్ధిరేటు 10.6 శాతంగా నమోదైంది. గతంలో గుజరాత్, కేరళ అభివృద్ధి నమూనాల గురించే చర్చ జరిగేది. ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాము. విద్యుత్ సమస్యలు పరిష్కరించి చీకటి నుండి వెలుగులవైపు పయనించాం. రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. తెలంగాణలో అనుసరిస్తున్న ప్రణాళిక దేశంలో చర్చకు కేంద్ర బిందువైందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *