నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం ఢిల్లీ వెళ్ళిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీతో పటు పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం చర్చించనున్నారు. ఇందులో భాగంగా ఈరోజు కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమై ఎఫ్ఆర్ బీఎం పెంపు, కేంద్ర పథకాల్లో రాష్ట్ర వాటా అంశంపై సీఎం చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి నిధులు కేటాయించాలని కేసీఆర్ అరుణ్ జైట్లీకి విజ్ఞప్తి చేశారు.
సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు వినోద్ కుమార్, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధులు వేణుగోపాలాచారి, రామచంద్రు తేజావత్ తదితరులు కేంద్రమంత్రిని కలిసినవారిలో ఉన్నారు. ఇదిలాఉండగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కూడా సమావేశమై ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రహదారులపై చర్చించనున్నారు. అనంతరం నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం పాల్గొననున్నారు.