mt_logo

ఢిల్లీలో సీఎం కేసీఆర్ రైతుదీక్ష

రైతుల ప‌క్షాన ప్ర‌జాప్ర‌తినిధుల నిర‌స‌న దీక్ష పేరుతో ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా టీఆర్ఎస్ పార్టీ చేప‌ట్టిన దీక్ష‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్, రాకేశ్ తికాయ‌త్ హాజ‌ర‌య్యారు. స‌భా వేదిక వ‌ద్ద ఏర్పాటు చేసిన అమ‌ర‌వీరుల స్థూపానికి, మ‌హాత్మా జ్యోతిబా పూలే, అంబేద్క‌ర్ చిత్ర‌ప‌టాల‌కు కేసీఆర్ నివాళుల‌ర్పించారు. తెలంగాణ త‌ల్లి విగ్ర‌హానికి కేసీఆర్ పుష్పాలు స‌మ‌ర్పించారు. కేంద్రం యాసంగి ధాన్యం కొనాల‌నే డిమాండ్‌తో టీఆర్ఎస్ పార్టీ ఈ దీక్ష చేప‌ట్టింది. ధాన్యం సేక‌ర‌ణ‌లో ఒకే విధానం ఉండాల‌నే డిమాండ్‌తో ఈ దీక్ష చేస్తున్నారు. ఈ దీక్ష‌లో మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో పాటు నాయ‌కులు పాల్గొన్నారు. వరి ధాన్యం కొనుగోళ్ల‌పై కేంద్రానికి టీఆర్ఎస్ అల్టిమేటం ఇవ్వ‌నుంది. దీక్ష వేదిక‌గా టీఆర్ఎస్ త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. కేంద్రంపై పోరును మ‌రింత తీవ్రం చేసే యోచ‌న‌లో సీఎం కేసీఆర్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *