mt_logo

కల్యాణలక్ష్మి, షాదీముబార‌క్ పథకాలతో బాల్య వివాహాలకు చెక్ : మంత్రి గంగుల కమలాకర్

సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డంతో తెలంగాణ‌లో బాల్య వివాహాల‌ను అరిక‌ట్ట‌గ‌లిగామ‌ని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా క‌ల్యాణ‌లక్ష్మి, షాదీ ముబార‌క్ ప‌థ‌కాల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధానం ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రెండు ప‌థ‌కాల కింద 10 ల‌క్ష‌ల 26 వేల 396 మంది ల‌బ్ధి పొందారు. బీసీ సంక్షేమం ద్వారా 4,87,346 మంది, గిరిజ‌న శాఖ ద్వారా 1,21,639 మంది, మైనార్టీ శాఖ ద్వారా 2,10,676, ఎస్సీ శాఖ ద్వారా 2,06,735 మంది ల‌బ్ధి పొందారు. ఈ రెండు ప‌థ‌కాల‌కు మొత్తంగా రూ. 8,673.67 కోట్ల ఖ‌ర్చు చేయ‌డం జ‌రిగింది. బీసీ శాఖ ద్వారా రూ. 4,355 కోట్లు, గిరిజ‌న శాఖ ద్వారా రూ. 975 కోట్లు, మైనార్టీ శాఖ ద్వారా రూ. 1,682 కోట్లు, ఎస్సీ శాఖ ద్వారా రూ. 1,660 కోట్లు ఖ‌ర్చు చేశామ‌ని తెలిపారు. క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీ ముబార‌క్ ప‌థ‌కాల‌తో బాల్య వివాహాలు అరిక‌ట్ట‌గ‌లిగామ‌ని చెప్పారు. ఈ విష‌యం నేష‌న‌ల్ ఫ్యామిలీ హెల్త్ స‌ర్వేలో కూడా తేలింద‌ని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *