mt_logo

ఒకరిది తిక్క.. ఒకరిది ఫ్రస్ట్రేషన్‌

By: కట్టా శేఖర్ రెడ్డి

దేశంలో ఈసారి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఏ ఒక్క పార్టీ లేక కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఎన్డీయేకు 220-40 స్థానాలు లభించడానికి అవకాశాలున్నాయి. యూపీఏకు 130-140 స్థానాలు రావడానికి అవకాశం ఉంది. రెండు కూటములకూ ఇతర పార్టీల మద్దతు బాగా అవసరం ఉంటుంది. ఇతర పార్టీల్లో యూపీఏ అనుకూల పార్టీలు ఉన్నాయి. ఎన్డీయేకు అనుకూల పార్టీలూ ఉన్నాయి. ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వం ఇప్పటంత బలంగా ఏకపక్షంగా ఉండకపోవచ్చు అని జాతీయ రాజకీయ విశ్లేషకుడొకరు ఒక జాతీయ ఛానెల్లో చర్చల సందర్భంగా వివరించారు. ఆయన ఒక్కరే కాదు, అనేకమంది విశ్లేషకులు అటుఇటుగా చెబుతున్నదిదే. ఎన్డీయే బలహీనపడింది. యూపీఏ కొంతవరకు బలపడింది, కానీ ఎన్డీయేను ఢీ కొట్టేంత సీను లేదు. బీజేపీ సొంతంగా పోయినసారి 282 స్థానాలు గెల్చుకున్నది. ఈసారి ఆ పార్టీ 200 స్థానాల్లోపే గెల్చుకునే అవకాశం ఉన్నదని ఆ పరిశీలకుల అంచనా. పోయిన ఎన్నికల్లో బీజేపీకి ఏకపక్ష ఫలితాలు ఇచ్చిన యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఆ పార్టీకి గట్టిగా దెబ్బపడుతుందన్నది వారి అంచనా. ఆ మేరకు ఈశాన్య భారతంలో కొంతవరకు మెరుగుపడే అవకాశం ఉన్నా ఇక్కడ జరిగే లోటును భర్తీ చేయడం కష్టమని వారు భావిస్తున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకునే బీజేపీ పొత్తుల విషయంలో అన్ని రాష్ట్రాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించింది. చిన్న, పెద్ద పార్టీలను కలుపుకొని వెళుతున్నది. ఏ ఒక్క సీటునూ వదలకూడదన్నది బీజేపీ విధానంగా చెబుతున్నారు. కాంగ్రెస్ మాత్రం ఎప్పటిలాగే అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నది.

ఆంధ్ర ప్రయోజనాలకు, తెలంగాణ ప్రయోజనాలకు మధ్య వైరుధ్యం లేదు. ఆంధ్రకు ప్రత్యేకహోదా ఇచ్చినా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినా తెలంగాణ ఏనాడూ అభ్యంతరం చెప్పలేదు. చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ వంటి సంకుచిత, స్వార్థ, తిరోగమన నాయకులు పెట్టే పంచాయతీలు తప్ప తెలంగాణకు, ఆంధ్రకు పంచాయతీ లేదు. సినిమాల మీద, ముఖ్యంగా తెలంగాణ ప్రేక్షకులు ఇచ్చిన పైసాపైసా మీద బతికిన పవన్‌కల్యాణ్ అనే మనిషి నిన్న ఎంత పెద్ద బండ తెలంగాణ మీద వేశాడో అందరూ గమనించారు. పవన్‌కల్యాణ్ దివాలాకోరు రాజకీయనాయకుడని, ఒక స్థిమితం, విధానం, నిబద్ధత లేని నాయకుడని ఆయనే పదేపదే రుజువు చేసుకున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీది పెద్ద వైఫల్యం. బీఎస్పీ, ఎస్పీ, కాంగ్రెస్, ఆర్‌ఎల్‌డీ కలిసి పోటీచేసి ఉంటే అక్కడ బీజేపీకి 15 స్థానాలకు మించి వచ్చే అవకాశం లేదని ఆ పరిశీలకుడి అంచనా. పోయిన ఎన్నికల్లో 71 స్థానాలు గెల్చుకున్న బీజేపీ 15 స్థానాలకు పరిమితమైతే కచ్చితంగా కేంద్రంలో అధికారంలోకి రావడం కష్టమై ఉండేదని, కాంగ్రెస్, బీఎస్పీలు రెండూ మొండిగా వ్యవహరించి పొత్తును విఫలం చేశాయని పరిశీలకుల భావన. వీరికయ్యం వల్ల్ల బీజేపీ 30 నుంచి 40 స్థానాలు గెల్చుకోవడానికి అవకాశాలు మెరుగుపడ్డాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తరభారతంలోని పరిస్థితి మనకు గుర్తుచేసే పాఠం ఒకటుంది. అందుకే ఇదంతా చెప్పడం. తెలంగాణ జాతీయస్థాయిలో ఒక కీలకపాత్ర పోషించడానికి ఇదే అదను. తెలంగాణ ప్రయోజనాలను సాధించుకోవడానికి ఇదే తరుణం. స్వాతంత్య్రానంతరం ఉమ్మడి రాష్ట్రానికి ఒకటి రెండుసార్లు అవకాశం వచ్చినా చంద్రబాబు మరికొందరి కోడి మెదడు రాజకీయాల వల్ల రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం చేకూరలేదు. ఇక తెలంగాణ విషయం సరేసరి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాతినిథ్యం తక్కువే. వారి మాటకు చెల్లుబాటూ తక్కువే. మన రాష్ట్రం వచ్చిన తర్వాత తొలిసారిగా కేంద్రంలో సంకీర్ణం ఏర్పడే పరిస్థితి వచ్చింది. మన ఎంపీలపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిన పరిస్థితి తలెత్తబోతున్నది. అందుకే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవలసిన అవసరం తెలంగాణ ప్రజలపై ఉంది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఆశిస్తున్నవిధంగా మొత్తం 16కు పదహారు స్థానాలు టీఆర్‌ఎస్ గెలువాల్సిన అవసరం ఉన్నది. కొత్తగా ఏర్పడిన మన రాష్ట్రం సాధించుకోవలసినవి చాలా ఉన్నాయి. నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయహోదా, రైల్వే, జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, మనకు విభజన చట్టంలో ఇస్తానని ఇవ్వకుండా ఉన్న ప్రాజెక్టులు అన్నీ సాధించుకోవడానికి ఇదే సరైన సమయం.

అందుకు టీఆర్‌ఎస్ అభ్యర్థులు 16 మంది గెలువాల్సిన అవసరం ఉన్నది. మన వాళ్ల పంచాయితీలు, అసంతృప్తులు, అలకలు అన్నీ తర్వాత పరిష్కరించుకోవచ్చు. ఇప్పుడు మాత్రం లక్ష్యం ఒక్కటే కావాలి పదహారు స్థానాలు గెలువడం. కాంగ్రెస్, బీజేపీ గెలిస్తే వారేమీ తెలంగాణ పక్షాన మాట్లాడే అవకాశం లేదు. ఒకవేళ మాట్లాడినా మాటవరుసకే తప్ప, కొట్లాడే సాహసం చేయరు. వారు వారి జాతీయ నాయకత్వాలు చెప్పినట్టు వినాలి. వారు కోరుకున్నట్టు నడుచుకోవాలి. మంచికైనా చెడుకైనా మనోడే కావాలి. ఒక్క కట్టుమీద ఉండి పనిచేసే వారు కావాలి. అందుకే టీఆర్‌ఎస్ మొత్తం 16 స్థానాలు గెలువడం ఇప్పుడు తెలంగాణవాదుల లక్ష్యం కావాలి. కృష్ణా జలాల పంపిణీపై పంచాయితీ ఇంకా తేలాల్సి ఉన్నది. తెలంగాణకు న్యాయమైన వాటా సాధించుకోవాల్సి ఉంది. నియోజకవర్గాల పునర్విభజన చేయించుకోవాల్సి ఉన్నది. బయ్యారం ఉక్కు కర్మాగారం, కేంద్ర విద్యాలయాలు చాలా ఇక్కడికి రావాల్సి ఉంది. మనవాళ్లయితేనే ఫైళ్లు పట్టుకొని ప్రభుత్వం చుట్టూ తిరిగి సాధించుకురాగలరు. మనవాళ్లు ప్రభుత్వంలో ఉంటే ఇక చెప్పవలసిన పనిలేదు. ఆంధ్ర ప్రయోజనాలకు తెలంగాణ ప్రయోజనాలకు వైరుధ్యం లేదు. ఆంధ్రకు ప్రత్యేకహోదా ఇచ్చినా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినా తెలంగాణ ఏనాడూ అభ్యంతరం చెప్పలేదు. చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ వంటి సంకుచిత, స్వార్థ, తిరోగమన నాయకులు పెట్టే పంచాయతీలు తప్ప తెలంగాణకు, ఆంధ్రకు పంచాయితీ లేదు. సినిమాల మీద, ముఖ్యంగా తెలంగాణ ప్రేక్షకులు ఇచ్చిన పైసాపైసా మీద బతికిన పవన్‌కల్యాణ్ అనే మనిషి నిన్న ఎంత పెద్ద బండ తెలంగాణ మీద వేశాడో అందరూ గమనించారు. పవన్‌కల్యాణ్ దివాలాకోరు రాజకీయ నాయకుడని, ఒక స్థిమితం, విధానం, నిబద్ధత లేని నాయకుడని ఆయనే పదేపదే రుజువు చేసుకున్నారు.

చంద్రబాబు ఆయనను ఆపరేట్ చేస్తున్నాడంటే తొలుత ఎవరూ నమ్మలేదు. కానీ చంద్రబాబు భాషే ఇప్పుడు పవన్ కల్యాణ్ మాట్లాడతున్నాడు. చంద్రబాబు కంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఆంధ్రవాళ్లు హైదరాబాద్‌కు వెళితే కొడుతున్నారని పవన్ కల్యాణ్ ఒక పెద్ద అబద్ధాన్ని ఆంధ్ర ప్రజలకు చెప్పారు. హైదరాబాద్‌లో ఒక్క ఆంధ్ర పౌరుడన్నా ప్రాంతీయ వివక్షతో తమను కొట్టారని ఫిర్యాదు చేశారా? ఎంత దుర్మార్గపు ప్రచారం? ఎంత నేలబారు ఆరోపణ? హైదరాబాద్ దేశంలోని అన్నిరాష్ట్రాల ప్రజలను అక్కున చేర్చుకుంది. బీహారీలు మొదలు ఒరియన్ల వరకు ఉత్తరప్రదేశ్ మొదలు గుజరాత్, రాజస్థాన్‌లకు చెందినవారి వరకు, కేరళ, తమిళనాడు, కర్ణాటక.. నగరంలో ఏ ప్రాంత ప్రజలు లేరు? ఎంత మంది నిక్షేపంగా తమ పనులు వృత్తులు చేసుకోవడం లేదు? తెలంగాణ ఏర్పడి ఐదేండ్లయింది. పెద్దపెద్ద కంపెనీలు, రెస్టారెంట్లు, హోటళ్లు అన్నీ ఆంధ్రా ప్రాంత వ్యాపారవేత్తలవే. ఎవరినైనా తెలంగాణ ప్రభుత్వం కానీ, తెలంగాణ వాళ్లు కానీ వేధించిన సందర్భం ఉందా? ఒక్కరైనా ఇక్కడ తమ వ్యాపారం ఇబ్బందిగా ఉందని అమరావతికి మారారా? ఎందుకు నటుడా ఇంత అభాండం వేశావూ? తమరికి తిక్క ఉందని తెలుసు. ఆ తిక్కకు ఒక లెక్కలేదని ఇప్పుడు అర్థమవుతున్నది. తెలంగాణ పెద్దలెవరో బెదిరిస్తే ఆంధ్రలో టీడీపీ నుంచి బయటికి వస్తున్నారని, వైసీపీలో చేరుతున్నారని పొదల చాటునుంచి కనిపెట్టిన ఒక జర్నలిస్టు తమ పత్రికలో రాశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు అనేకమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, అభ్యర్థులు పార్టీ మారుతుంటే, ఆపుకోలేనినీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకొని, నెపం తెలంగాణపై మోపుతావా? ఇంతకంటే నీచత్వం ఉంటుందా? చంద్రబాబు రాజకీయాలకు అంతిమ దశ మొదలైందని ఆయన ఫ్రస్ట్రేషన్ బట్టబయలు చేస్తున్నది.

ఆయన పాపాలు పండే రోజులు దగ్గరపడ్డాయని ఆయన అడ్డగోలు ఆరోపణలు చెబుతున్నాయి. ఆయన మాటల్లో చేతల్లో అధికారాంతపు లక్షణాలు కనిపిస్తున్నాయి. ఒక్కమాట చెప్పాలి. ఆర్థిక నేరాలకు పాల్పడి కోర్టుల రక్షణ పొందుతున్న వ్యాపారవేత్తల ముఠా అంతా చంద్రబాబుతోనే ఉంది. చంద్రబాబుతో పాటు సుజనాచౌదరి, రాయపాటి సాంబశివరావు, సీఎం రమేశ్, కావూరి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్ ఇంకా అనేకమంది హైదరాబాద్‌లో ఆస్తులు కలిగి ఉన్నారు. అందరిపై కేసులున్నాయి. వీరేమైనా పార్టీ మారారా? వీరినెవరైనా బెదిరించారా? ప్రమాణం చేసి చెబుతారా! ఇదంతా ఒక పెద్ద దగాకోరు రాజకీయ ముఠా. ఒక అబద్ధాన్ని వంద మందితో వందలసార్లు మాట్లాడించి దానిని జనం చేత నిజమని నమ్మించి మోసం చేసి బతుకడం ఈ ముఠాకు బాగా అలవాటైంది. అందుకు కొనసాగింపుగానే బాబు, కళ్యాణ్, ఇంకా ఇతర పచ్చ ముఠాలు, మీడియా తెలంగాణకు, ఆంధ్రకు వైరుధ్యాన్ని రాజేసి, రగిలించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఆంధ్రను ఐదేండ్లు పాలించిన చంద్రబాబు ఒక్క మంచిమాట చెప్పి ఓటు అడుగడం లేదు. ఎంతసేపు కేసీఆర్‌ను, జగన్‌ను తిట్టిపోసి జనాల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లు గుంజాలని చూస్తున్నారు. చంద్రబాబు రాజకీయంగా రోజురోజుకు అథమాథమ స్థాయికి జారిపోతున్నాడు. ఆయన ఈ ఐదేండ్లలో ఆంధ్రను అక్కడి ప్రజలను ఘోరంగా విఫలం చేశారు. ఎన్నికల వేళ మహిళలకు, వృద్ధులకు పింఛన్లు పెంచి పంపిణీ చేయడం తప్ప ఆయన చేసిన ఒక్క గొప్ప కార్యం లేదు. కేసీఆర్‌కు సంక్షేమం ఒక విధానం. చంద్రబాబుకు సంక్షేమం ఒక అవకాశవాద పాచిక. అందుకే ఆయనను జనం నమ్మడం లేదు.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *