ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈరోజుతో ముగిసింది. నామినేషన్లకు చివరిరోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు అభ్యర్ధుల నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 28 వరకు గడువు ఉంది. రాష్ట్రంలో ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుండగా.. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పలువురు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధులు ఇవాళ నామినేషన్లు వేశారు.
వరంగల్ లోక్ సభ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పసునూరి దయాకర్, ఆదిలాబాద్ అభ్యర్థి జీ నగేష్, జహీరాబాద్ అభ్యర్థి బీబీ పాటిల్, మహబూబ్ నగర్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, పెద్దపల్లి అభ్యర్థి బోర్లకుంట వెంకటేష్ నేత, సికింద్రాబాద్ అభ్యర్థి తలసాని సాయికిరణ్ లు భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్లు వేశారు. మరోవైపు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారంతా వరుస ప్రచారాలతో దూసుకుపోతున్నారు.