mt_logo

తెలంగాణ ప్రభుత్వ పోరాటానికి దిగివచ్చిన కేంద్రప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం చేసిన రైతు పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. రాష్ట్రానికి చెందిన వానాకాలం పంటకు సంభందించి బియ్యాన్ని మరింత కొనేందుకు ముందుకు వచ్చింది. గత కొద్దికాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు యావత్ ప్రజానీకం బియ్యం సేకరణ గురించి కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రప్రభుత్వం స్పందించి రాష్ట్రం నుండి అదనంగా మరో ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ఖరీఫ్ సీజన్ బియ్యాన్ని సేకరించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. కాగా తాజా ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రము నుండి 46 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించనుండగా.. ఇందుకు సంబంధించి 68 లక్షల టన్నుల  ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *