తెలంగాణ ఏర్పాటుపై చిత్తూరు కిరణ్ విషం కక్కి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే మరో చిత్తూరు బాబు తానేమీ తక్కువ తినలేదని నిరూపించాడు. గత కొన్నేళ్లుగా తెలంగాణకు వ్యతిరేకం కాదు అంటూ నెట్టుకొస్తున్న చంద్రబాబు, మరోసారి తాను కరడుగట్టిన సమైక్యవాదినని నిరూపించుకున్నాడు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను తప్పుబడుతూ చంద్రబాబు శుక్రవారం ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు మూడు పేజీల లేఖ రాశారు. ఇందులో ఆయన రాష్ట్ర ఏర్పాటుపై తన అక్కసు అంతా వెలిగక్కాడు. నేరుగా తెలంగాణ వద్దని అనకుండా, ఆ అర్థం వచ్చేటట్లు అనేక మాటలు అన్నాడు.
అందరినీ సంప్రదించి, సుధీర్ఘ కసరత్తు చేసిన తరువాత కాంగ్రెస్ చేసిన ప్రకటన “ఏకపక్షంగా” ఉన్నదని చంద్రబాబు ఆరోపించాడు. రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్రులకు అనేక సమస్యలు వస్తాయని ఏకరువు పెట్టిన ఆయన, తెలంగాణ ప్రజల ఆకాంక్షల గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు.
ఎప్పటికైనా చంద్రబాబు వంటి నేతలు తెలంగాణను బలిపెట్తి సీమాంధ్ర ప్రయోజనాలే చూస్తారని మరోసారి చంద్రబాబు తాజా లేఖతో నిరూపణ అయ్యింది.