బోష్ కంపెనీ స్మార్ట్ క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఇవాళ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. పరిశ్రమలకు మౌళిక సదుపాయాల కల్పనలో హైదరాబాద్ నగరం ముందు వరుసలో ఉంటుందని కేటీఆర్ అన్నారు. నగర అభివృద్ధికి సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని, దానికి తగిన వేగంతోనే అభివృద్ధి జరుగుతోందన్నారు. హైదరాబాద్ నగరంలో గత ఏడాదిన్నరలో లక్షన్నర ఉద్యోగాలు సృష్టించినట్లు మంత్రి తెలిపారు.
ఆటోమొబైల్ రంగంలో అతి పెద్ద కంపెని అయిన బోష్ తెలంగాణాలో నూతన ఆఫీస్ పెట్టడం మన ఖ్యాతిని మరింత పెంచిందన్నారు. ఈ క్యాంపస్ ద్వారా ఆటోమోటివ్ రంగంలో బోష్ మరింత రాటుదేలుతుందని ఆశిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ కంపెనీ వలన 3000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఊహించానని, కానీ ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మంత్రి అన్నారు.
హైదరాబాద్‌లో ఫార్ములా-ఈను ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇండియాలో ఆ ఈవెంట్‌ను నిర్వహిస్తున్న తొలి నగరం హైదరాబాద్ అని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఏడాది ఈవీవీ సమ్మిట్‌ను నిర్వహించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మొబిలిటీ వ్యాలీని సృష్టించేందుకు తెలంగాణ సర్కార్ కృషి చేస్తోందన్నారు. క్వాల్‌కామ్ లాంటి సెమీ కండెక్టర్ కంపెనీలు హైదరాబాద్‌లో దూసుకువెళ్తున్నాయన్నారు. హయ్యెస్ట్ గ్రోత్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించినట్లు మంత్రి తెలిపారు. ఐటీ ఎగుమతులు రాష్ట్రం నుంచి భారీగా పెరిగినట్లు మంత్రి చెప్పారు. ఇండియాలో మూడవ వంతు ఉద్యోగాలు హైదరాబాద్‌లో క్రియేట్ అయినట్లు తెలిపారు.