mt_logo

రేవంత్, శ్రీధర్ బాబును లైట్ తీసుకున్న బిల్‌ గేట్స్?

రాష్ట్రానికి ఒక రోజు పర్యటన కోసం వచ్చిన మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్, మాజీ చైర్మన్, సీఈవో బిల్ గేట్స్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును లైట్ తీసుకున్నట్టున్నారు. గతంలో ఆయన హైదరాబాద్ వచ్చిన ప్రతిసారీ రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ, ఐటీ శాఖ మంత్రిని కానీ కలవడం ఆనవాయితీగా వస్తోంది.

మైక్రోసాఫ్ట్ ప్రస్తుత సీఈవో సత్యా నాదెళ్ల కూడా హైదరాబాద్ వచ్చిన ప్రతిసారీ రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ, ఐటీ మంత్రిని కానీ కలుస్తారు.

ఈసారి కూడా బిల్‌ గేట్స్ వస్తున్న సమాచారం తెలిసిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ముఖ్యమంత్రిని కానీ, ఐటీ మంత్రిని కానీ కలవాలని కోరగా సమయం లేనందువల్ల కలవలేడని బిల్ గేట్స్ ఆఫీసు నుండి జవాబు వచ్చినట్టు సమాచారం. 

నిజానికి రేవంత్ సర్కార్ వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకురావడం లేదు. ఇటీవల చేసిన కొన్ని పెట్టుబడుల ప్రకటనలు కూడా గత ప్రభుత్వ హయాంలో వచ్చినవే. విధాన నిర్ణయాల్లో గందరగోళంతో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను రద్దు చేయడం వంటి దుందుడుకు చర్యల ద్వారా రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ను తీవ్రంగా దెబ్బతీసినట్లు అయింది అని పరిశ్రమ వర్గాలు వాపోతున్నాయి.

దానికి తోడు అంతో ఇంతో కార్పొరేట్ కల్చర్ తెలిసిన దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ముకుతాడు వేసేవిధంగా రేవంత్ రెడ్డి వ్యవహరించడంతో పరిస్థితి ఇంకా జటిలం అయ్యింది. పెద్ద పారిశ్రామికవేత్తలను ఎవరినీ శ్రీధర్ బాబు ఒక్కరే కలవద్దు అని, ప్రముఖ పారిశ్రామిక సమావేశాలకు తానే ముఖ్య అతిధిగా ఉండాలని రేవంత్ పట్టుబడుతున్నారట.

గత నెలలో దావోస్ సమావేశాల్లో, నిన్న మొన్న జరిగిన బయో ఏషియా సదస్సులో కూడా ప్రసంగల్లో రేవంత్ తొట్రుపాటు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురైన విషయం తెలిసిందే.