mt_logo

జాతీయ మీడియాలో మారు మ్రోగిన ‘భారత్ రాష్ట్ర సమితి’

దసరా పండుగనాడు యావత్తు దేశం తెలంగాణ వైపు చూసింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవిర్భావించిన టీఆర్‌ఎస్‌.. 14 సంవత్సరాలపాటు మరో స్వాతంత్య్ర ఉద్యమాన్ని తలపించేలా పోరాడి స్వరాష్ట్రాన్ని సాధించుకొన్నది. ఆ తర్వాత ఎనిమిదేండ్ల నుంచి అధికారంలో కొనసాగుతూ రాష్ట్రానికే పరిమితమైన టీఆర్‌ఎస్‌.. పార్టీ పుట్టిన 21 ఏండ్ల తర్వాత ‘భారత్‌ రాష్ట్ర సమితి’గా అవతరించి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించింది. ఈ చారిత్రక సన్నివేశానికి హైదరాబాద్‌ వేదికగా మారడంతో జాతీయ మీడియా మొత్తం హైదరాబాద్‌పైనే దృష్టి సారించింది. ప్రముఖ ఆంగ్ల, హిందీ ప్రముఖ దినపత్రికలతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి స్థానిక భాషల్లో వెలువడే వార్తాపత్రికలు, వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాలు ‘భారత్‌ రాష్ట్ర సమితి’కి ఎనలేని ప్రాధాన్యమిచ్చి పతాక శీర్షికల్లో ప్రచురించాయి. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావాన్ని ఇండియా టుడే, మిర్రర్‌ నౌ, ఎన్‌డీటీవీ ఇండియా, ఎన్‌డీటీవీ 24/7, రిపబ్లిక్‌ టీవి, జీన్యూస్‌ తదితర వివిధ చానళ్లు బ్రేకింగ్‌ న్యూస్‌గా ప్రసారం చేయడంతోపాటు ఈ అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమాలను నిర్వహించాయి.

టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా: భారత్‌ రాష్ట్ర సమితి: ‘21 ఇయర్స్‌ ఆఫ్టర్స్‌ లాంచ్‌, కేసీఆర్‌ టర్న్స్‌ ఇన్‌టు నేషనల్‌ పార్టీ’ శీర్షికతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

హిందుస్తాన్‌ టైమ్స్‌: ‘అహెడ్‌ ఆఫ్‌ 2024, కేసీఆర్‌ ఫోరే ఇన్‌టు నేషనల్‌ పాలిటిక్స్‌ విత్‌ భారత్‌ రాష్ట్ర సమితి’ శీర్షికతో కథనాన్ని ప్రచురించింది.

ఎన్‌డీటీవీ: ‘తెలంగాణ సీఎం కేసీఆర్‌ మూవ్స్‌ టు నేషనల్‌ స్టేజ్‌ విత్‌ భారత్‌ రాష్ట్ర సమితి’ శీర్షికతో కథనాన్ని ప్రచురించింది.

ఇండియా టుడే: ‘ఐయింగ్‌ 2024 పోల్స్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌ లాంచెస్‌ నేషనల్‌ పార్టీ, నేమ్స్‌ ఇట్‌ భారత్‌ రాష్ట్ర సమితి’ శీర్షికతో కథనాన్ని ప్రచురించింది.

ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌: ‘కేసీఆర్‌ లాంచెస్‌ నేషనల్‌ పార్టీ, టీఆర్‌ఎస్‌ నౌ భారత్‌ రాష్ట్ర సమితి’ శీర్షికతో కథనాన్ని ప్రచురించింది.

న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌: ‘టీఆర్‌ఎస్‌ నౌ భారత్‌ రాష్ట్ర సమితి, కేసీఆర్‌ స్టెప్స్‌ అవుట్‌ ఆఫ్‌ తెలంగాణ, ఎంటర్స్‌ నేషనల్‌ పాలిటిక్స్‌’ అంటూ వార్తా కథనాన్ని ప్రచురించింది.

ది హిందూ: ‘టీఆర్‌ఎస్‌ నేమ్స్‌ ఇట్‌సెల్ఫ్‌ టు భారత్‌ రాష్ట్ర సమితి, ఫోరేస్‌ ఇన్‌టు నేషనల్‌ పాలిటిక్స్‌’ వార్తా కథనాన్ని ప్రచురించింది.

టైమ్స్‌ నౌ: ‘తెలంగాణ సీఎం కేసీఆర్‌ లాంచెస్‌ నేషనల్‌ పార్టీ భారత్‌ రాష్ట్ర సమితి, ఐస్‌ 2024 ఎలక్షన్స్‌’ శీర్షికతో కథనాన్ని ప్రచురించింది.

ఇండియా టీవీ న్యూస్‌: ‘భారత్‌ రాష్ట్ర సమితి: తెలంగాణ సీఎం కేసీఆర్‌ టర్న్స్‌ టీఆర్‌ఎస్‌ ఇన్‌టు నేషనల్‌ పార్టీ బీఆర్‌ఎస్‌’ శీర్షికతో వార్తా కథనాన్ని ప్రచురించింది.

ది న్యూస్‌ మినిట్‌: ‘కేసీఆర్‌ అనౌన్స్‌ నేషనల్‌ పార్టీ భారత్‌ రాష్ట్ర సమితి ఆన్‌ దసరా’ శీర్షికతో కథనాన్ని ప్రచురించింది.

ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌: ‘తెలంగాణ సీఎం కేసీఆర్‌ టేక్స్‌ హిజ్‌ పార్టీ నేషనల్‌, టీఆర్‌ఎస్‌ నౌ భారత్‌ రాష్ట్ర సమితి’ శీర్షికతో వార్తా కథనాన్ని ప్రచురించింది.

ది క్వింట్‌ : ‘టీఆర్‌ఎస్‌ టు బీఆర్‌ఎస్‌: కేసీఆర్‌ లాంచెస్‌ భారత్‌ రాష్ట్ర సమితి, మేక్స్‌ నేషనల్‌ పొలిటికల్‌ పార్టీ’ శీర్షికతో వార్తా కథనాన్ని ప్రచురించింది.

స్క్రోల్‌.ఇన్‌: ‘కే చంద్రశేఖర్‌రావు ఎంటర్స్‌ నేషనల్‌ పాలిటిక్స్‌ విత్‌ భారత్‌ రాష్ట్ర సమితి’ శీర్షికతో వార్తను ప్రచురించింది.

ది వైర్‌: ‘టీఆర్‌ఎస్‌ చెంజెస్‌ నేమ్‌ టు భారత్‌ రాష్ట్ర సమితి యాజ్‌ కేసీఆర్‌ ఎంటర్స్‌ నేషనల్‌ పాలిటిక్స్‌’ శీర్షికతో వార్తా కథనాన్ని ప్రచురించింది.

న్యూస్‌ 18: ‘ఫ్రమ్‌ నాన్‌ కాంగ్రెస్‌ థర్డ్‌ ఫ్రంట్‌ టు గోయింగ్‌ నేషనల్‌, కేసీఆర్‌ స్టెప్స్‌ బియాండ్‌ తెలంగాణ విత్‌ భారత్‌ రాష్ట్ర సమితి. వై నౌ?’ శీర్షికతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

ఎఎన్‌ఐ: ‘కేసీఆర్‌ లాంచెస్‌ నేషనల్‌ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి ఇజ్‌ నౌ భారత్‌ రాష్ట్ర సమితి’ శీర్షికతో వార్తను ప్రచురించింది.

నవ భారత్‌ టైమ్స్‌: ‘కేసీఆర్‌ నే పార్టీ కే నామ్‌ సే తెలంగాణ హటాకర్‌ భారత్‌ క్యోం లగా దియా, రాజ్‌నీతి సమఝియే’ అంటూ కధనాన్ని ప్రచురించింది.

ప్రభాత్‌ ఖబర్‌ : ‘కేసీఆర్‌ కీ రాష్ట్రీయ రాజనీతి మే ఎంట్రీ కీ తయారీ, పార్టీ కా నామ్‌ బదల్‌కర్‌ కియా భారత్‌ రాష్ర్ట్‌ సమితి’ అనే కథనాన్ని ప్రచురించింది.

అమర్‌ ఉజాలా : ‘నితిశ్‌ కో బడా ఝట్కా.. కేసీఆర్‌నే బనాయా భారత్‌ రాష్ట్ర సమితి.. హైదరాబాద్‌ మే దేశ్‌ కా నేతా కేసీఆర్‌ కే లగే నారే’ శీర్శికన కథనాన్ని ప్రచురించింది.

దైనిక్‌ భాస్కర్‌ : ‘తెలంగాణ సీఎంనే దసరా పర్‌ లాంచ్‌ కీ నేషనల్‌ పార్టీ’ అనే కథనాన్ని ప్రచురించింది.

హిందుస్థాన్‌ : ‘కేసీఆర్‌ నే దోపెహర్‌ 1.19 బజే లాంచ్‌ కీ అపనీ నయీ రాష్ట్రీయ పార్టీ, ఇస్‌ సమయ్‌ కే పీఛే ఛుపా హై కౌన్‌సా రాజ్‌’ అనే కథనాన్ని ప్రచురించింది.

వన్‌ ఇండియా: కేసీఆర్‌ నే రాష్ట్రీయ రాజ్‌నీతి కీ ఓర్‌ బఢాయా పెహలా కదమ్‌, తెలంగాణా రాష్ట్ర సమితి కా నామ్‌ హువా భారత్‌ రాష్ర్ట్‌ సమితి’ అనే కథనాన్ని ప్రచురించింది.

పత్రిక : ‘భారత్‌ రాష్ట్ర సమితి కే నామ్‌ సే తెలంగాణ సీఎం కేసీఆర్‌ నే బనాయా నయీ నేషనల్‌ పార్టీ, అబ్‌ రాష్ట్రీయ రాజనీతి మే దేంగే దఖల్‌’ అనే శీర్షికతో కథనాన్ని ప్రచురించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *