Mission Telangana

ఎంపీ కవితకు శుభాకాంక్షల వెల్లువ..

ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గెలుచుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్ఎస్ ఎంపీ కవితకు దేశం నలుమూలల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా టీఆర్ఎస్ ఎన్నారై సెల్ సౌత్ఆఫ్రికా శాఖ తరపున ఆ శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ఎంపీ కవితకు శుభాకాంక్షలు తెలిపారు. ఆదర్శ్ క్యాటగరీలో ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఎంపికైనట్లు ప్రతిష్టాత్మక సంస్థ ఫేం ఇండియా ఏషియా పోస్ట్ మ్యాగజైన్ కొద్దిరోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలోని లోక్ సభ సభ్యుల్లో 25 మందిని ఈ అవార్డుకు ఎంపిక చేయగా, అందులో తెలంగాణ నుండి ఎంపీ కవిత ఉన్నారు. ప్రజాదరణ, సామాజిక సేవాదృక్పథం, లోక్ సభకు హాజరు, లోక్ సభ నిర్వహణలో పాత్ర, ప్రశ్నలు అడగడం తదితర అంశాల ఆధారంగా ఎంపీలను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.

సర్వే నిర్వహించిన అత్యధిక విభాగాల్లో ఎంపీ కవితకు 90 శాతానికి పైగా పాయింట్లు వచ్చాయి. అంతేకాకుండా కవిత తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని, క్రియాశీలకంగా వ్యవహరించారని, కళా సంస్కృతిని పరిరక్షించడంలో, మంచి వక్తగా కూడా ఆమె పేరు పొందారని ఈ సర్వే పేర్కొంది. తెర మరుగవుతున్న తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో కీలకంగా వ్యవహరించారని, బతుకమ్మ పండుగకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో ఆమె కృషి చేశారని సర్వే స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *