అసని తుఫాను ప్రభావం… తెలంగాణలో భారీ వర్షాలు

  • May 11, 2022 2:05 am

అసని తుఫాను ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తుఫానుకు తోడు తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్‌ కర్నాటక వరకు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని పేర్కొంది. దీంతో ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా.. మంగళవారం నగరంలో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాగల 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 39 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

 


Connect with us

Videos

MORE