mt_logo

భాగ్యనగరానికి ప్రఖ్యాత స్విస్ రీ ఐటీ కంపెనీ

హైద‌రాబాద్‌కు మ‌రో ప్ర‌తిష్ఠాత్మ‌క ఐటీ సంస్థ రాబోతోంది. స్విస్-రీ కి చెందిన ఎన‌లిక‌ల్‌, ఇన్నోవేష‌న్ హ‌బ్ గ్లోబ‌ల్ బిజినెస్ సొల్యూష‌న్స్ (GBS) త‌మ నూత‌న కేంద్రాన్ని హైద‌రాబాద్‌లో ఏర్పాటుచేయ‌నుంది. ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో ఈ నూత‌న కార్యాల‌యాన్ని ప్రారంభించ‌నున్న‌ట్లు స్విస్ రీ సంస్థ‌ ప్ర‌క‌టించింది. స్విస్ రీ యూనిట్‌ను ఏర్పాటు చేయ‌డానికి హైద‌రాబాద్‌ను అద్భుతమైన ప్రాంతంగా భావిస్తున్నట్లు ఆ కంపెనీ సీఈవో ర‌స్సెల్ హిగ్గిన్‌బోతం తెలిపారు. హైద‌రాబాద్‌లో కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌డం ద్వారా ప్ర‌పంచాన్ని స్థిరంగా మార్చే అంత‌ర్జాతీయ ప‌రిష్కారాల‌ను అందించ‌డంలో డిజిట‌ల్‌, డేటా టెక్నాల‌జీ సామ‌ర్థ్యాన్ని శ‌క్తిమంతం చేయ‌వ‌చ్చ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. హైద‌రాబాద్‌లోని ప్ర‌తిభ గ‌ల యువ‌తకు మంచి అవ‌కాశాల‌ను క‌ల్పిస్తుంద‌ని గ్లోబ‌ల్ బిజినెస్ సొల్యూష‌న్ సెంట‌ర్ ప్ర‌తినిధి అమిత్ కార్ల అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *