mt_logo

శాసనసభలో కాళోజి ఉద్యాన విశ్వవిద్యాలయ సవరణ బిల్లు ఆమోదం

శాసనసభలో శుక్రవారం సాయంత్రం కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం 2007 చట్ట సవరణ బిల్లును రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రవేశపెట్టగా దానిని సభ ఆమోదించింది. దీంతో నూతన ఉద్యాన పాలిటెక్నిక్ లు ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం అయింది. అంతేకాకుండా రాష్ట్రంలోని ఏకైక అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ ద్వారా అటవీరంగంలో బహుళ డిగ్రీ మరియు డిప్లొమా ప్రోగ్రామ్ లను అందించడానికి విశ్వవిద్యాలయానికి వీలు కల్పించడం జరిగింది. దీనివల్ల ఇక్కడ చదివే విద్యార్థులకు ప్రయోజనం చేకూరడమే కాకుండా, అటవీ విద్య, పరిశోధన కోసం ఆయా రంగాల నిపుణులకు విస్తృత అవకాశాలు, గుర్తింపు లభిస్తుంది. అలాగే రాష్ట్రంలోని ఉద్యానరంగ ఎదుగుదలకు తోడ్పడుతుంది. దేశంలో ఉద్యానరంగంలో ఉన్న డిమాండ్, అవకాశాల దృష్ట్య ఉద్యాన విశ్వ విద్యాలయం ద్వారా వచ్చే ఈ వృత్తి విద్యా నిపుణులకు మంచి అవకాశాలు లభిస్తాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *