mt_logo

ప్రత్యేకాంధ్ర కోసమే ఆంధ్ర మహాసభ

By: – ఉ.సా.
ఉద్యమాల ఉపాధ్యాయుడు

గుంటూరు జిల్లా బాపట్ల టౌన్‌హాల్ లో ప్రథమ ఆంధ్ర మహాసభ జరిగి 2013 మే 26 నాటికి వందేళ్లయిన సందర్భంగా.. బాపట్లలో ఆంధ్ర మహాసభ శతాబ్ది ఉత్సవం జరుగుతున్నది. ఈ ఉత్సవ నిర్వహణ కోసం మే 24న బాపట్లలో జరిగిన సన్నాహాక సభను కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ప్రారంభించారు. ఈ ఉత్సవాలకు గుర్తుగా ప్రత్యేక తపాలా (పోస్టు) కవర్‌ను ఆమె విడుదల చేశారు. ఈ సభకు అధ్యక్షత వహించిన కరడుగట్టిన సమైక్యవాది గాదె వెంకట్‌ రెడ్డి మాట్లాడుతు ‘మద్రాసు, హైదరాబాద్ అవిభక్త రాష్ట్రాల్లో విడివిడిగా ఉన్న తెలుగు వారందరిని కలిపి ఒకే భాషా రాష్ట్రంలో సమైక్యం చేసి విశాలాంధ్ర ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతోనే ఆనాటి ఆంధ్ర మహాసభ జరిగిందని, అమరజీవి పొట్టి  శ్రీరాములు ప్రాణత్యాగం చేసింది కూడా ఆ లక్ష్యంతోనే అని చరిత్రకు వక్రభాష్యం చెప్పాడు. నిజానికి నాడు జరిగిన ప్రథమాంధ్ర మహాసభ ప్రత్యేకాంధ్ర రాష్ట్రం ఏర్పడాలని చర్చించిందేగాని సమైక్యాంధ్ర గురించి, విశాలాంధ్ర గురించి చర్చించలేదు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసింది మద్రాసు రాజధానిగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలనేగానీ, హైదరాబాద్ రాజధానిగా సమైక్యాంధ్ర కావాలని కాదు.

ఈ దృష్టితోనే, ఈ చారిత్రక వాస్తవికతని వెలుగులోకి తేవాలనే ఉద్దేశంతోనే 2005 మే 26న అదే బాపట్లలో మహాజన పార్టీ ఆధ్వర్యంలో ఆనాటి ప్రత్యేకాంధ్ర రాష్ట్రం మళ్లీ ఏర్పడాలని తీర్మానిస్తూ, ప్రత్యేకాంధ్ర మహాసభను నిర్వహించింది. అంతేకాదు ఈ ప్రత్యేకాంధ్ర, ప్రత్యేక తెలంగాణకు జైకొట్టే ప్రత్యేకాంధ్ర కావాలని తీర్మానించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో ఎటూ తేల్చకుండా దాగుడు మూతలాడుతున్న కాంగ్రెస్ ఎట్టకేలకు తన లోగుట్టు బయటపెట్టింది. టిఆర్‌ఎస్ తోడ్పాటుతో రాష్ట్రంలో అధికారం చేజిక్కి, కేంద్రంలో అధికారం చేజారకుండా ఏడాది గడిచి, అవసరం తీరిపోయాక ఏరుదాటి తెప్పతగలేసిన చందంగా తెలంగాణ ఏర్పాటుకు మొండిచెయ్యి చూపింది.

పార్టీలో ఎవరికి ఎలాంటి అభిప్రాయాలున్నా, కాంగ్రెస్ అధికారికంగా రెండవ ఎస్‌ఆర్‌సీకే కట్టుబడి ఉంటుందని యూపీఏ సబ్‌కమిటీ చైర్మన్ ప్రణబ్ ముఖర్జీ తేల్చిచెప్పడంతో ఈ దాగుడు మూతలకు ఇక తెరపడిపోయింది. అంతేకాదు, తెలంగాణపై పార్లమెంటులో ఎలాంటి బిల్లు ప్రవేశపెట్టాలన్నా ముందు యూపీఏ కూటమిలోని రాజకీయపార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరాలన్న షరతు విధించారు. ఇంతకీ అసలు తెలంగాణ రాష్ట్రసాధనకు కావలసింది రాజకీయ పార్టీల ఏకాభిప్రాయమా, ప్రజాభివూపాయమా అనే ప్రశ్న కీలకమైనది.

కనుక ఈ దృష్టితో ముందు రాజకీయ పార్టీల ఏకాభిప్రాయం సంగతి, తర్వాత రెండవ ఎస్‌ఆర్‌సీ సంగతి చూద్దాం. 1953లో కర్నూలు రాజధానిగా ఏర్పడిన ఆంధ్రరాష్ట్రంతో తెలంగాణ ప్రాంతాన్ని విలీనం చేయడం ద్వారా 1956లో విశాలాంధ్రగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తున్న సమయంలో నాటి ఫజల్ అలీ కమిషన్ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగించాలని సిఫార్సు చేసింది. విలీనం తప్పనిసరైతే హైదరాబాద్ శాసనసభ మూడింట రెండువంతుల మెజారిటీతో నిర్ణయించాలని స్పష్టం చేసింది. ఈ సిఫార్సు ల్ని తుంగలోతొక్కి తెలంగాణను ఎలా దగాచేశారో, తెలంగాణ మళ్ళీ ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగాలని ఎందుకు డిమాండ్ చేస్తోందో-మొదటి ఎస్‌ఆర్‌సీ ప్రాతిపదికపై ఈ సిఫార్సులను పరిశీలిస్తే-మళ్ళీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తప్పదు కనుక దానిని తప్పించడానికే రెండవ ఎస్‌ఆర్‌సీ ఏర్పాటు ఎత్తుగడ.

కాంగ్రెస్ వైఖరి-తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మొండిచెయ్యిచూపే రెండవ ఎస్‌ఆర్‌సీ వైఖరి. వామపక్షాలది దానిని కూడా వ్యతిరేకించే వైఖరి. మళ్ళీ వారిలో ఒకరిది మధ్యేవాద వైఖరి. ఇక ప్రతిపక్ష బిజెపిది సమయానుకూల వైఖరి. కేంద్రంలో రాజకీయ సమీకరణలను బట్టి ఒకసారి తెలంగాణవాదాన్ని, మరొకసారి సమైక్యవాదాన్ని బలపరిచే అవకాశవాద వైఖరి. ఈ రకంగా ఈ అవకాశవాద రాజకీయపార్టీల మధ్య తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమైన ఏకాభిప్రాయంలేదు గానీ, ప్రతికూలమైన ఏకాభిప్రాయం ఉన్నది.

కనుక తెలంగాణ ఏర్పాటుకు కావలసింది రాజకీయపార్టీల ఏకాభిప్రాయం కాదు, ప్రజాభిప్రాయం. కాలదోషం పట్టిన సమైక్యాంధ్ర నినాదాన్ని వల్లిస్తున్న భాషా రాష్ట్రవాదులు ఆరోపిస్తున్నట్టు తెలంగాణవాదం, వేర్పాటువాదం కాదు. వాగ్దానాలు నమ్మి దగాపడిన తెలంగాణ ప్రజల జన్మహక్కు. 50 ఏళ్లుగా అన్యాయానికి గురై వెనుకబడిన తెలంగాణ ప్రజల న్యాయమైన ప్రాంతీయ ప్రజాస్వామిక హక్కు. విశాలాంధ్రలో ప్రజారాజ్య స్థాపన పట్లగానీ, సమైక్యాంధ్రలో సమానాభివృద్ధి పట్లగానీ వీరికి ఎలాంటి జవాబుదారీతనం గానీ, చిత్తశుద్ధిగానీ లేవని 50 ఏళ్ల తెలంగాణ అనుభవం చాటిచెబుతున్నది. తెలంగాణ కోసం 1969లో ఒకసారి, 1996నుంచి మరోసారి తెలంగాణ ఉద్యమించటమే ఇందుకు నిదర్శనం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే ప్రజల ఆకాంక్షగా, ప్రజాభిప్రాయంగా పలుసార్లు ఎన్నికల్లో రుజువుకావడం మరో నిదర్శనం.

నాడు 1969లో తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించిన త్రెలంగాణ ప్రజాసమితికే ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారు. నేడు మరోసారి టీఆర్‌ఎస్‌కు, దాంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్, వామపక్ష కూటమికే తెలంగాణ ప్రజలు పట్టంకట్టారు. టీడీపీ, బీజేపీ కూటమిని ఓడించారు. ఒక ఓటు, రెండు రాష్ట్రాల తీర్మానాన్ని బుట్టదాఖలుచేసి, టీడీపీతో పొత్తుపెట్టుకున్నందుకే తమకు తెలంగాణ ప్రజలు బుద్ధిచెప్పారని బీజేపీ వాపోవడం దీన్నే రుజువుచేస్తున్నది. అంతేకాదు, అధికార దాహంతో సమైక్యాంధ్ర సిద్ధాంతాన్ని విస్మరించి తెలంగాణతో జతకట్టిన కాంగ్రెస్-వామపక్ష కూటమి అవకాశవాదాన్ని ఎండగట్టిన టీడీపీ, ఆంధ్ర-రాయలసీమ ప్రాంతాల్లో సమైక్యాంధ్రవాదాన్ని రెచ్చగొట్టడానికి విశ్వప్రయత్నం చేసింది. అయినా అక్కడ కూడా టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్‌నే అక్కడి ప్రజలు గెలిపించారంటే ఆ ప్రాంత ప్రజల అభిప్రాయం సైతం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు, రెండవ రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా లేదని స్పష్టమైపోయింది.

తెలంగాణ వనరులను, ఆదాయాలను కొల్లగొట్టి కోట్లకు పడగలెత్తిన ప్రాంతీయ ప్రాబల్యశక్తుల దోపిడీ పీడనలకు ఆంధ్రప్రాన్త దళత బహుజన బడుగువర్గాల ప్రజలు కూడా గురవుతున్నందు వల్లనే సామాన్య ప్రజలు వారికి వత్తాసు పలకటంలేదు. తెలంగాణ ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడితే, రెండు ప్రాంతాల్లోని సామాన్య ప్రజలకు పోయేదేమీ లేదు. కనుక ప్రాంతీయ ప్రజాస్వామిక, సామాజిక ప్రజాస్వామిక శక్తుల ఉమ్మడి సారధ్యంలో తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం రెండు ప్రాంతాల్లో ఏకకాలంలో ఉద్యమం సాగించి ఆంధ్రప్రదేశ్‌పై పెత్తనం చెలాయిస్తున్న ఈ ప్రాంతీయ ప్రాబల్యవర్గాల రాజకీయ గుత్తాధిపత్యాన్ని తుదముట్టించేందుకు, పూనుకోవడమే మేలైన మార్గం.

టీడీపీ, కాంగ్రెస్ వామపక్ష పార్టీల పేర్లు వేరైనా వాటికి సారధ్యం వహిస్తున్న రెండు సామాజిక వర్గాల మూలాలు ఒకటే. వీటి స్వార్థపర ప్రాంతీయ ప్రాబల్యం కోసం, విశాలాంధ్రపై రాజకీయ గుత్తాధిపత్యం కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అవి మోకాలడ్డుతున్నాయని ఇటీవల విజయశాంతి చేసిన ప్రకటనలు కూడా దళిత బహుజన వర్గాల మనోగతాన్ని ప్రతిబింబిస్తున్నాయి. కనుక ఈ దృక్పథంతోనే, ఒకవైపు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును సమర్థిస్తూ, అందుకోసం ఈనెల 26న బాపట్లలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర మహాసభ నిర్వహణకు మహాజన పార్టీ పూనుకొంటున్నది. 1913లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుకు నాంది పలుకుతూ మే 26న బాపట్లలో తొలి ఆంధ్రమహాసభ జరిగిన చారిత్రక ప్రాధాన్యం దృష్టిలో పెట్టుకొని అదేతేదీన బాపట్లలో మరో ఆంధ్రరాష్ట్ర మహాసభ జరగటం గమనార్హం.

ఈ మహాసభ ఇలా తీర్మానించింది. ‘ఈ సందర్భంగా మేము చెప్పదలచుకున్నది ఏమంటే ఆంధ్రవూపాంతంలోని మెజారిటీ ప్రజలు ప్రత్యేక ఆంధ్రరావూష్టాన్ని కోరుకుంటున్నారనేదే. ప్రత్యేక తెలంగాణను స్వాగతిస్తూనే ప్రత్యేక ఆంధ్రరావూష్టాన్ని ఆంధ్ర ప్రజలు డిమాండు చేస్తున్నారు. ఆంధ్రవూపాంత ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకోవటంలేదని, తెలంగాణ విడిపోవటానికి వీల్లేదని కొందరు చేస్తున్న ప్రచారం వారి స్వార్థంకోసమే కానీ అది ప్రజాభివూపాయంకాదు. కనుక ఉమ్మ డి రాష్ట్రాన్ని తమ అధికారం క్రింద పెట్టుకోవాలని, దోపిడీని యథేచ్ఛగా కొనసాగించుకోవాలనే పాలక కుల ప్రయోజనాలు తప్ప అవి ప్రజల అభివూపాయాలు కావనేది స్పష్టం’ అని తేల్చి చెప్పింది.

ప్రజాభివూపాయానికి-వూపజా వ్యతిరేక రాజకీయ పార్టీల అభివూపాయానికి మధ్య జరుగుతున్న రాజకీయ పోరాటంలో ప్రజాభివూపాయాన్ని శిరసావహించక తప్ప దు. అంతేకాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును రాజకీయ సమస్యగా పరిగణించాలి. ప్రత్యేక ప్యాకేజీలు అనీ, ప్రత్యేక ప్రాంతీయ అభివృద్ధి బోర్డులు అనీ రాజకీయేతర ఆర్థిక పరిష్కారాలు, మధ్యే మార్గాలు అసలు మార్గాన్ని పక్కమార్గం పట్టిస్తాయి. తెలంగాణ సమస్య ప్రధానంగా ఆర్థికపరమైన ప్రాంతీయ వెనుకబాటుతనం సమస్యయే అయినా, అది అపరిష్కృతంగా కొనసాగటానికి ప్రధాన కారణం నియంవూతణలేని ప్రాంతేతర ప్రాబల్య వర్గాల రాజకీయ గుత్తాధిపత్యమే. రాజకీయానికి ఆర్థికమే మూలం కనుక, ఆర్థిక ప్రయోజనాల కోసం రాజకీయ అదికారం కైవసం చేసుకోవడమే రాజకీయ పోరాటలక్ష్యం. సమైక్యాంవూధపై రాజకీయ గుత్తాధిపత్యం చెలాయించడం ద్వారానే ప్రాంతీయ ప్రాబల్య వర్గాలు తమ స్వప్రయోజనాలను నెరవేర్చుకొంటున్నాయి. ఆ గుత్తాధిపత్యాన్ని కొనసాగించుకోవడానికే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మోకాలడ్డుతున్నాయి. ఈ ప్రాబల్యవర్గాల ప్రాంతీయ దోపిడీ, పీడనల్ని అరికట్టి, తెలంగాణపై పాలనాధికారం తెలంగాణవాసులకు దక్కటం అనే రాజకీయ పరిష్కారమే తప్ప మరి ఏ ఇతర రాజకీయేతర మార్గాలు, మధ్యే మార్గాలు పనికిరావు.

(నమస్తే తెలంగాణ సౌజన్యంతో)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *