mt_logo

దేశంలో రాక్షస పాలన అంతానికి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి : ముక్తకంఠంతో కోరిన టీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ అధ్యక్షులు

హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ అధ్యక్షులు మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా బాల్క సుమన్‌ మాట్లాడుతూ.. దేశంలో రాక్షస పాలన అంతం కావాలంటే కేసీఆర్‌ మందుకు రావాలన్నారు. దేశంలో దుర్మార్గ పాలన నడుస్తున్నదని, ఎనిమిదేండ్లుగా మోదీ ఏలుబడిలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి రావాలని, దేశ ప్రజానికం ముఖ్యమంత్రి వెంట ఉంటుందని చెప్పారు.

ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ…బీజేపీ ముక్త్‌ భారత్‌ కావాలంటే కేసీఆర్‌ జాతీయ పార్టీ పెట్టాలని అన్నారు. మోదీ పాలనలో దేశంలోని ఏ వర్గానికి మేలు జరుగుతలేదన్నారు. రైతులు రాజులుగా మారాలంటే సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని చెప్పారు. తెలంగాణ తరహా అభివృద్ధి కోసం దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్‌ వైపు చూస్తున్నారని తెలిపారు. కావాలి కేసీఆర్‌.. రావాలి కేసీఆర్‌.. గెలవాలి కేసీఆర్‌ అని ప్రజలు అంటున్నారని పేర్కొన్నారు.

ఎంపీ కవిత మాట్లాడుతూ… దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్‌ రాకకోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఇతర రాష్ట్రాల రైతులు మెచ్చుకుంటున్నారని చెప్పారు.

కేసీఆర్‌ లాంటి నాయకుడు దేశానికి అవసరమని, కేసీఆర్‌ జాతీయ పార్టీ పెట్టాలని అందరూ ఎదురు చూస్తున్నారని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ అన్నారు. అన్ని భాషల్లో పట్టున్న వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని చెప్పారు.

ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్‌ నాయకత్వం చాలా అవసరమని హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్‌ అన్నారు.

సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ పథకాలు దేశమంతా అమలు కావాలంటే కేసీఆర్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు.

దేశప్రజలంతా తెలంగాణ వైపు చూస్తున్నారని ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి అన్నారు.

ప్రజలంతా సీఎం కేసీఆర్‌ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని చింతా ప్రభాకర్‌ అన్నారు.

ప్రజల ఆకాంక్ష మేరకు కేసీఆర్‌ దేశ రాజకీయాల్లోకి రావాలని ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ కోరారు.

ఒక విజన్‌ ఉన్న నాయకుడి కోసం దేశమంతా ఎదురుచూస్తున్నదని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. దేశం బాగుపడాలంటే దళితుల కోసం దళితబంధు తీసుకొచ్చిన కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందేనని చెప్పారు.

దేశాభివృద్ధి సీఎం కేసీఆర్‌ సాధ్యమని జనగాం జిల్లా అధ్యక్షుడు సంపత్‌ రెడ్డి అన్నారు.

సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్సీ తాత మధు వెల్లడించారు. దేశాన్ని ఆవహించిన చీకటిని తొలగించే కాంతి రేఖ సీఎం కేసీఆర్‌ అని చెప్పారు.

ఎంతో దూరదృష్టి కలిగిన వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని, అలాంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు అన్నారు.

యావత్‌ దేశం ఇవాళ తెలంగాణ వైపు చూస్తున్నదని ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *