మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌కు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రమైన చండూరులోని డాన్‌బోస్కో కాలేజీకి పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు. గ్రామాల వారీగా సిబ్బందికి ఎన్నికల సామాగ్రి అధికారులు పంపిణీ చేస్తున్నారు. సామాగ్రి తీసుకున్న సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు.
మునుగోడు నియోజకవర్గంలో రేపు ఉదయం 7 గంటలకు ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,21,720 మంది పురుషులు, 1,20,128 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ నెల 6న ఓట్లను లెక్కించనున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఈ ఉపఎన్నికను పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు.
మండలాల వారీగా ఓటర్లు..
చౌటుప్పల్- 59,433 (పురుషులు- 29,882, మహిళలు- 29,547)
నారాయణపురం- 36,430 (పురుషులు- 18,446, మహిళలు- 17,984)
మునుగోడు- 35,780 (పురుషులు- 18,042, మహిళలు- 35,780)
చండూరు- 33,509 (పురుషులు- 16,848, మహిళలు- 16,661)
గట్టుప్పల్- 14,525 (పురుషులు- 7,368, మహిళలు- 7,157)
నాంపల్లి- 33,819 (పురుషులు- 16,856, మహిళలు- 16,962)
మర్రిగూడెం- 28,309 (పురుషులు- 14,230, మహిళలు- 14,078)