అగ్రిహబ్ అద్భుతం : శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్

  • September 29, 2021 8:51 pm

ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో ఇటీవల ఏర్పాటు చేసిన అగ్రి ఇన్నోవేషన్‌ హబ్‌ అద్భుతమని శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్‌ ప్రశంసించారు. ఈ ఆలోచన వ్యవసాయరంగంలో నూతన ఆవిష్కరణలకు ఊతమిస్తుందని పేర్కొన్నారు. బుధవారం ఆయన యూనివర్సిటీని సందర్శించిన సందర్భంగా వ్యవసాయ రంగంలో యూనివర్సిటీ చేస్తున్న పలు పరిశోధనలను అగ్రిహబ్ డైరెక్టర్‌ జగదీశ్వర్‌ ఆయనకు వివరించారు. యూనివర్సిటీలో చేస్తున్న పలు పరిశోధనలను శ్రీలంకలోనూ అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం తెలంగాణతో కలిసి పని చేసేలా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం యూనివర్సిటీ అధికారులతో, అగ్రిహబ్‌ అధికారులతో ఆయన సమావేశమైన పలు అంశాలపై చర్చించారు.


Connect with us

Videos

MORE