mt_logo

లండన్‌లో ఘనంగా ఎన్నారై టీ.ఆర్.ఎస్ సెల్ 5వ వార్షికోత్సవం..

– బంగారు తెలంగాణ నిర్మాణంలో కే.సీ.ఆర్ పాలన భేష్.. ఎన్నారైల హర్షం!
– ముఖ్య అతిథిగా భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్

లండన్‌లో ఎన్నారై టీ.ఆర్.ఎస్ సెల్ ఆధ్వర్యంలో “మీట్ అండ్ గ్రీట్ విత్ భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ గారు” మరియు ఎన్నారై టీ.ఆర్.ఎస్ సెల్ 5వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. యూకే నలుమూలల నుండి భారీగా తెరాస కార్యకర్తలు, తెలంగాణ వాదులు హాజరయ్యారు. కార్యదర్శి నవీన్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా అమరులను స్మరించుకొని, జయశంకర్ గారికి నివాళులు అర్పించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్నారై టీ.ఆర్.ఎస్ సెల్ ఐదు సంవత్సరాలలో చేసిన ముఖ్య కార్యక్రమాల వీడియోని ప్రదర్శించి, అతిథులకు వివరించారు. డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ గారి ఉద్యమ-రాజకీయ ప్రస్థానంతో కూడిన ఒక వీడియోని కూడా ప్రదర్శించారు.

డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ గారు మాట్లాడుతూ, ఉద్యమంలో ఎన్నారైల పాత్ర గొప్పదని తెలిపారు. ఉద్యమ సంధర్భంలో ఎన్నారైల పోరాటానికిచ్చిన స్పూర్తి ఎప్పటికీ మరవలేనని, ముఖ్యంగా లండన్ లోని ఎన్నారై టీ.ఆర్.ఎస్ విభాగం పిలుపూనిచ్చిన ప్రతి కార్యక్రమానికి ఇక్కడ నుండి మద్దతు తెలిపిన తీరు చాలా గొప్పదని ప్రశంసించారు. బంగారు తెలంగాణ నిర్మాణ దిశలో టీ.ఆర్.ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పథకాల గురించి వివరించారు. టీ.ఆర్.ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కలుపుకొని అందరి సూచనలని తీసుకొని ముందుకు వెళుతుందని, కాబట్టి మీరు కూడా ఎటువంటి సలహాలు అయినా లేదా సందేహాలు ఉన్నా వ్యక్తిగతంగా నన్ను కాని, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కాని సంప్రదించవచ్చు అని తెలిపారు. మనం కలలు కన్న బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ గారు అహర్నిశలు కష్టపడ్తున్నారని, ఎటువంటి సందేహాలు అవసరం లేదని హామీ ఇచ్చారు. ప్రతి తెలంగాణ బిడ్డ ప్రపంచంలో ఎక్కడున్నా వారి వృత్తుల్లో ఎదిగి రాష్ట్ర పునర్నిర్మాణంలో బాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. తన వంతు బాధ్యతగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చెప్పి, ప్రభుత్వంలో ప్రత్యేక ఎన్నారై శాఖ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఎన్నారై- టీ.ఆర్.ఎస్ అధ్యక్షులు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ, ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సమయం ఇచ్చి కార్యక్రమానికి వచ్చినందుకు డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ గారికి కృతఙ్ఞతలు తెలిపారు. ఎన్నారై టీ.ఆర్.ఎస్ సెల్ కి ఎప్పటికప్పుడు కేసీఆర్ గారు మరియు యావత్ టీ.ఆర్.ఎస్ నాయకులు ఇస్తున్న ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు తెలిపారు. డాక్టర్ వృత్తిలో ఉంటూ.. డాట్స్ ఛైర్మన్ గా ఆనాటి ఉద్యమ సమయంలో.. నేడు ఎంపీగా పునర్నిర్మాణంలో వారి పాత్ర గురించి సభకు వివరించారు. తెలంగాణ పునర్నిర్మాణం కేవలం కేసీఆర్ గారి వల్లే సాధ్యమని, వారి నాయకత్వాన్ని బలపరచడం చారిత్రాత్మక అవసరమని సభకు తెలిపారు. ఎలాగైతే ఉద్యమంలో వారి వెంట ఉండి ముందుకు నడిచామో, అలాగే బవిష్యత్తులో కూడా వారు చూపిన బాటలో నడుస్తామని తెలిపారు. కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రపంచంలో తెలంగాణ బిడ్డ ఎక్కడున్నా అక్కడ ఎన్నారై. టీ.ఆర్.ఎస్ శాఖలు ఏర్పాటు చేసి గులాబిమయం చేయడమే లక్ష్యం అని తెలిపారు. పునర్నిర్మాణంలో కూడా కేసీఆర్ గారి వెంట ఉంటామని తెలిపారు. అలాగే రానున్న వరంగల్ ఉప ఎన్నికల్లో టీ.ఆర్.ఎస్ అభ్యర్థి దయాకర్ పసునూరి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఉపాధ్యక్షులు మంద సునీల్ రెడ్డి మాట్లాడుతూ, రాజకీయ పార్టీ అయినప్పటికీ, ఎన్నారైలుగా మావంతు బాధ్యతగా తెలంగాణ ప్రజలకు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి సభకు వివరించారు. తెలంగాణ ఎన్నారై ఫోరం(TeNF) అధ్యక్షులు సిక్క చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో అందరినీ ఎలా కలుపుకొని పోయిందో, అదే స్పూర్తితో ఎన్నారై- టీ.ఆర్.యస్ మరియు వివిధ ప్రవాస తెలంగాణ సంస్థలతో పని చేసిన తీరుని వివరించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా, మావంతు బాధ్యతగా బిజినెస్ మీట్ మరియు తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే క్రమంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ-బోనాల సంబరాల గురించి, తెలంగాణ బిడ్డల కోసం చేస్తున్న చారిటీ కార్యక్రమాల గురించి సభకు వివరించారు.

ఎన్నారై- టీ.ఆర్.ఎస్ ప్రతినిధులు డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ గారిని ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందచేశారు. అలాగే ఇదే వేదికపై తెలంగాణ ఎన్నారై ఫోరం(TeNF) ప్రతినిధులు సైతం డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ గారిని ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. చివరిగా ఎన్నారై-టీ.ఆర్.ఎస్ సెల్ 5వ వార్షికోత్సవం సందర్భంగా డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ గారు కేక్ కట్ చేసి నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ గారు వచ్చిన అతిథులని వ్యక్తిగతంగా వెళ్లి కలిసి సందడి చేశారు, ఒక డాక్టర్ గా, మేధావిగా వారి సేవలు చాలా గొప్పవని హాజరైన అతిథులు ప్రశంసించారు. వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించారు.

కార్యక్రమంలో ఎన్నారై. టీ.ఆర్.ఎస్ అధ్యక్షులు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షులు మంద సునీల్ రెడ్డి, తెలంగాణ ఎన్నారై ఫోరం(TeNF) అధ్యక్షులు సిక్క చంద్రశేఖర్ గౌడ్, కార్యదర్శి నవీన్ రెడ్డి, సెక్రెటరీ దొంతుల వెంకట్ రెడ్డి, యూకే &యురోప్ ఇన్‌ఛార్జ్ విక్రమ్ రెడ్డి, లండన్ ఇన్‌ఛార్జ్ రత్నాకర్ కడుడుల, అధికార ప్రతినిథి శ్రీకాంత్ జెల్ల, వెల్‌ఫేర్ ఇన్‌ఛార్జ్ వినయ్ కుమార్, మెంబర్‌షిప్ ఇన్‌ఛార్జ్ సతీష్ రెడ్డి బండ, వెస్ట్ లండన్ ఇన్‌ఛార్జ్ లు మధుసూధన్ రెడ్డి మరియు రాజేష్ వర్మ, ముఖ్య నాయకులు శ్రీకాంత్ పెద్దిరాజు, చిత్తరంజన్ రెడ్డి, సృజన్ రెడ్డి చాడ, సత్య అలాగే తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ప్రతినిధులు ఉదయ్ నాగరాజు, ప్రమోద్ అంతటి, నగేష్ రెడ్డి, సుమాదేవి, స్వాతి బుడగం, సురేష్, అపర్ణ, స్వామి ఆశ, జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్(JET) ప్రతినిధులు నర్సింహా రెడ్డి, వంశీ, తెలంగాణ జాగృతి ప్రతినిధులు సంపత్, సంతోష్, శ్రవణ్ రెడ్డి, బ్రిటిష్ సౌత్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కామర్స్(BSICC) ప్రతినిధులు సుజిత్ నాయర్, జేకబ్ రవిబాలన్ తదితరులు హాజరైన వారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *