mt_logo

ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ లో తెలంగాణకు 19 అవార్డులు

తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు జాతీయ స్థాయిలో మరోసారి అవార్డుల పంట పండింది. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ప్రతి ఏటా ఇచ్చే అవార్డులతో భాగంగా ఈ అవార్డులను ప్రకటించినట్టు అధికారులు తెలిపారు. జిల్లా, మండల, గ్రామ పంచాయతీ లకు వివిధ కేటగిరిలలో 19 అవార్డులను తెలంగాణ రాష్ట్రం సాధించిందని తెలిపారు. నాలుగు కేటగిరీల్లో 19 ఉత్తమ అవార్డులు తెలంగాణ దక్కించుకుంది. ఇందులో ఉత్తమ జిల్లా పరిషత్ గా సిరిసిల్లకు అవార్డు దక్కగా ఉత్తమ మండలాలుగా వరంగల్ జిల్లా పర్వత గిరి, పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి, సూర్యాపేట జిల్లా తిరుమల గిరి, జగిత్యాల జిల్లా కొడిమ్యాల్ మండలాలకు అవార్డులు వచ్చాయి. అలాగే ఉత్తమ పంచాయతీలుగా సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ ఎర్రవల్లి గ్రామం, అదిలాబాద్ జిల్లా ముఖ్ర కే, కరీం నగర్ జిల్లా వెల్జాల, మహబూబాబాద్ జిల్లా వెంకటా పూర్, సిద్దిపేట జిల్లా జక్కా పూర్, సిద్దిపేట జిల్లా బూరుగు పల్లి, మహబూబ్ నగర్ జిల్లా గుండ్ల పోట్ల పల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా మద్దికుంట, మండే పల్లి, వరంగల్ జిల్లా పురం, పెద్దపల్లి జిల్లా నాగారం, హరి పురం, నారాయణపేట జిల్లా మంతన్ గడ్, వనపర్తి జిల్లా చందాపూర్ గ్రామలు అవార్డులు దక్కించుకున్నాయి. రాష్ట్రానికి అవార్డులు రావడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆనందం వ్యక్తం చేశారు.సీఎం కేసీఆర్ దూరదృష్టి, అభివృద్ధి విజన్ కారణంగానే ఈ అవార్డులు దక్కాయన్న మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *