వచ్చే ఏడాది ఎన్నికల షెడ్యూల్‌కు ముందే సంగారెడ్డి జిల్లా కొల్లూరు మెగా టౌన్‌షిప్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను మంజూరు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రాష్ట్ర ప్రభుత్వం 15,600 డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ఈ ఇళ్లను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తేదీలని అతిత్వరలో ప్రకటిస్తారు.
ఇక జనవరి 15లోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి అదే నెలలో కొత్త సంవత్సరం కానుకగా పంపిణీకి ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాల అధికారులను కలెక్టర్లను ఆదేశించింది. 1,422.15 కోట్ల అంచనా వ్యయంతో 115 బ్లాక్‌లతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మించింది. సువిశాల పార్కింగ్, వాచ్‌మెన్ కోసం క్వార్టర్‌లు మరియు అగ్నిమాపక ఏర్పాట్లతో నిర్మించారు. ఒక్కో బ్లాక్‌లో రెండు లిఫ్టుల చొప్పున మొత్తం 234 లిఫ్ట్‌లని రూపొందించారు.