mt_logo

మోహినికుంటలోనే కేసీఆర్ ఏడేడు తరాలు

తెలంగాణ గడ్డపై తరతరాల చరిత్ర.. నిఖార్సైన తెలంగాణ బిడ్డ కేసీఆర్

అసలు సిసలైన తెలంగాణ బిడ్డ కేసీఆర్… పోరాటాలకు నిలయమైన తెలంగాణ గడ్డపై పుట్టిన నిఖార్సైన పోరు బిడ్డ… తెలంగాణ నడిబొడ్డున ఉన్న మూడు జిల్లాల్లో వారి వంశప్రస్థానం సాగింది. పెట్టుబడి విషపుత్రికలు – సీమాంధ్ర పత్రికలు చేస్తున్న విష ప్రచారం సిగ్గుమాలిందని చరిత్ర అధారాలు చెపుతున్నాయి. కేసీఆర్ పూర్వీకులు వలస వచ్చారంటూ వదంతులు సృష్టించి, ప్రచారం చేస్తున్న దగాకోరు ఎల్లో జర్నలిజం పత్రికలకు చెంప ఛెళ్లుమనించే వాస్తవాలు కేసీఆర్ వారసత్వానికి ఉన్న బలాలు, మూలాలు..

ఒకటి కాదు.. రెండు కాదు.. అందుబాటులో ఉన్న ఏడు తరాల చరిత్ర చెబుతున్న సత్యమిది! కేసీఆర్ తాతముత్తాతలు.. వారి తాతముత్తాతలు నివాసమున్నది తెలంగాణ లోనే! అందులోనూ ఆరు తరాల వంశ ప్రస్థానం సాగింది మోహినికుంట గ్రామం నుంచే! ఇప్పటికీ మోహినికుంటలో కల్వకుంట్ల వంశస్థులు నివసిస్తున్నారు. సీమాంధ్ర పత్రికల రాతల్లో నిజానిజాలు తేల్చేందుకు మోహినికుంటకు వెళ్లినప్పుడు తెలంగాణ వ్యతిరేకుల చెంప ఛెళ్లుమనేలా వాస్తవాలు బయటపడ్డాయి! కేసీఆర్ తండ్రి రాఘవరావు.. ఆయన తండ్రి వెంకట్‌రావు, ఆయన తండ్రి ఎల్లారావు, ఆయన తండ్రి శివ్వారావు, ఆయన తండ్రి దివ్వారావు, ఆయన తండ్రి ఎల్లారావు.. అంతా కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామానికి చెందినవారే. వారి జీవన ప్రస్థానానికి సాక్షీభూతంగా నిలిచింది మోహినికుంట గ్రామం.

కేసీఆర్ తండ్రి రాఘవరావు జీవనయానం మాత్రం ఆయన ఇల్లరికం వెళ్లిన కారణంగా నిజామాబాద్ జిల్లా పోసాన్‌పల్లి (నేటి కోనాపూర్)లోనే కొంత భాగం సాగింది. ఆ తర్వాత అప్పర్‌మానేరు నిర్మాణం నేపథ్యంలో పొలాలు మునిగిపోవడంతో రాఘవరావు మరికొందరు పోసాన్‌పల్లి నుంచి చివరకు మెదక్‌జిల్లా చింతమడకలో స్థిరపడ్డారు. ఇదీ చరిత్ర! అయితే.. ఎవరో ఏదో చెప్పారంటూ సీమాంధ్ర పత్రికలు కేసీఆర్ మూలాలపై విష ప్రచారం చేస్తున్నాయని మోహినికుంటలో నివసిస్తున్న కల్వకుంట్ల వంశస్థులు, చింతమడకలోని కేసీఆర్ కుటుంబ మూలాలు ఎరిగినవారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాలకు వస్తే ఆధారాలు చూపుతామని సవాలు విసురుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖర్‌రావు తాత ముత్తాలే కాదు.. వారి తాత ముత్తాతలు పుట్టిన గడ్డ కూడా తెలంగాణలోని కరీంనగర్‌జిల్లా మోహినికుంట గ్రామమే. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలంలో ఉన్న మోహినికుంట గ్రామానికి వెళ్లి ఎవరిని అడినా వారి వశం గురించి చెపుతారు. ఒకనాడు కేసీఆర్ తండ్రితో పాటు ఉమ్మడిగా నివసించిన ఇళ్లు చూపిస్తారు. ఇప్పటికీ కల్వకుంట్ల వశంస్థులు ఈ గ్రామంలో నివసిస్తూనే ఉన్నారు. నమస్తే తెంగాణ- టీ న్యూస్ ప్రతినిధులు ఆ గ్రామానికి వెళ్లినప్పుడు కల్వకుంట్ల వంశస్థులు సీమాంధ్ర పత్రికలు చేస్తున్న తప్పుడు ప్రచారంపై భగ్గుమన్నారు. దమ్ముంటే రమ్మనండి.. కేసీఆర్ వంశంస్థులకు సంబంధించిన తరతరాల అధారాలు చూపుతామంటూ సవాలు విసిరారు.

ప్రస్తుతం ఉన్న అధారాలను బట్టిచూస్తే కేసీఆర్‌కు సంబంధించిన ఏడు తరాల చరిత్ర మూడు జిల్లాల్లో కొనసాగింది. కేసీఆర్ వంశీకులను చూస్తే.. ఎల్లారావు అనే వారి నుంచి వారి వద్ద వంశపారంపర్య ప్రస్థానం ఉంది. ఎల్లారావు కొడుకు దివ్వారావు ఈయన కొడుకు శివ్వారావు, ఈయన కొడుకు ఎల్లారావు, ఈయన కొడుకు వెంకట్‌రావు, ఈయన కొడుకు రాఘవరావుగా ఉన్నారు. ఇందులో రాఘవరావు కొడుకు కేసీఆర్. వీరిలో కేసీఆర్ తండ్రి రాఘవరావు తప్ప మిగిలిన వాళ్లందరూ మోహినికుంట గ్రామం నుంచే తమ ప్రస్థానం సాగించారు. కాలక్షికమంలో ఉద్యోగాలు, ఉపాధి రీత్యా కొన్ని కుంటుబాలు వెళ్లిపోయినా.. ఇంకా పలు కుటుంబాలు మోహినికుంటలోనే జీవనం సాగిస్తున్నాయి. కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా కొనసాతున్న సమయంలో మోహినికుంటలో ఉమ్మడిగా ఉన్న ఇంటిని జనశక్తి నక్సల్స్ 2003లో పేల్చివేశారు. దీంతో అ స్థానంలో కూలిపోగా మిగిలిన ఇంటిని కొంత బాగుచేయించి కేసీఆర్ పెద్దనాన్న జగ్గారావు కొడుకు రఘునాథరావు నివాసం ఉంటున్నారు. కూలిపోయిన ప్రాంతాన్ని పూర్తిగా తొలగించి అ స్థానంలో కేసీఆర్ మూడవ పెద్దనాన్న నర్సింగరావు కొడుకు గోపాల్‌రావు బిల్డింగ్ కట్టించి నివాసం ఉంటున్నారు. కేసీఆర్ ఎంపీగా ఉన్నారు కాబటి.. వారి వంశపారపర్యానికి చెందిన ఇళ్లు కూల్చివేస్తే కలకలం రేగుతుందని భావించి జనశక్తి నక్సల్స్ ఆ ఇంటిని పేల్చివేశారని అప్పల్లో వార్తలు వచ్చాయి.

ఇల్లరికం పోయిన కేసీఆర్ తండ్రి

వెంకట్‌రావుకు నలుగురు కొడుకులు. ఇందులో నాల్గవ కుమారుడు కేసీఆర్ తండ్రి రాఘవరావు. ఈయన చిన్నప్పటినుంచే అమిత మేథావి. ఏ విషయాన్ని అయినా ఇట్టే పరిష్కరించే సత్తాగల వాడు. అందరినీ కలుపుకొని వెళ్లేవారు. ఈయన చురుకుదనం, తెలివితేటలు గమనించే రాఘరావును ఇల్లరికం తీసుకెళ్లారని మోహినికుంటలోని కల్వకుంట్ల కుటుంబసభ్యులు చెపుతున్నారు. నిజమాబాద్ జిల్లా దోమకొండ మండలం కోనాపూర్ (ఒకనాటి పోసాన్‌పల్లి) గ్రామానికి చెందిన గునుకంటి రంగారావు కేసీఆర్ తండ్రి రాఘవరావును ఇల్లరికం తీసుకెళ్లారు. గునుకంటి రంగారావుకు ఇద్దరు కుమ్తాలు. గ్రామంలో 40 ఎకరాల మాగాణి, సుమారు వంద ఎకరాల కుష్కి ఉండేదని గ్రామస్తులు వెల్లడించారు. ఆ గ్రామంలో రంగారావు గడి అని ఎవరిని అడిగినా చెపుతారు. అంత పెద్ద గడి అది. అందుకే తెలివితేటలు అధికంగా ఉన్న రాఘవరావును ఇల్లరికం తీసుకెళ్లారని మోహినికుంట గ్రామస్తులు, వారి పెద్దనాన్న కుమారులు చెపుతున్నారు.

లక్షమమ్మ అనే కూతురితో వివాహం జరిపించిన రంగారావు పూర్తి బాధ్యతలను కేసీఆర్ తండ్రి రాఘవరావుకు అప్పగించారు. ఇల్లరికం పోయాడు కాబట్టి కోనాపూర్‌లో ఆయన ప్రస్థానం సాగింది. నైజాం ప్రభుత్వ హయాంలో ఆ గ్రామానికి ఎవరు వచ్చినా ముందుగా రాఘవరావును కలిసేవారు. అంత పేరు ప్రతిష్టలు సంపాదించారు. ఈ క్రమంలోనే నైజాం సర్కారు గంభీరావుపేట మండలం నర్మాల వద్ద అప్పర్ మానేరు ప్రాజెక్టుకు 1945లో శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రాఘవరావు, మరికొందరి భూములు ముంపునకు గురయ్యాయి. అనాటి సిద్దిపేట తాలుకా గుర్రాల గొంది గ్రామ పరిసరాల్లో అప్పటి సర్కారు ముంపు బాధితులకు భూములు కేటాయించింది. ఆ ప్రాంతానికి కేసీఆర్ తండ్రితో పాటు మరో ఏడు కుటుంబాలు వెళ్లాయి. ఆరంభంలోనే అక్కడి గ్రామస్థులు అడ్డుకోవడంతో అక్కడికి వెళ్లిన పలు కుటుంబాలు తిరిగి కరీంనగర్‌జిల్లా ముస్తాబాద్ మండలం అవునూర్ గ్రామ హ్యామ్లెట్ రాంరెడ్డిపప్లూకు వచ్చి భూములు కొనుగోలు చేసుకొని నివాసం ఏర్పాటు చేసుకున్నారు.

కేసీఆర్ తండ్రి రాఘవరావు మాత్రం చింతమడక గ్రామానికి వెళ్లి అక్కడ స్థిర పడ్డారు. అంటే 1945 నుంచి 50 మధ్యలోనే రాఘవరావు చింతమడక గ్రామానికి వెళ్లి స్థిర పడ్డారన్నమాట.

తెలంగాణ వారసత్వమే…

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమనేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుది అచ్చంగా తెలంగాణ వారసత్వమేనని, ఇందులో అనుమానాలకు, అపోహలకు ఎలాంటి అవకాశం లేదని కేసీఆర్ స్వగ్రామమైన మెదక్ జిల్లా సిద్దిపేట మండలం చింతమడకలోని ఆయన సన్నిహితులు, గ్రామస్థులు స్పష్టం చేస్తున్నారు. కేసీఆర్ పూర్వీకులు దాదాపు పది తరాల వరకు తమకు తెలుసునని, వారికి సీమాంవూధతో ఎలాంటి సంబంధాలు లేవని వారు స్పష్టం చేస్తున్నారు. కేసీఆర్‌కు చిన్ననాటి మిత్రుడైన బైరి కిష్టాడ్డి, ఆయన సన్నిహితులు బైరి వెంకట్‌డ్డి, బంధువులు అశోక్‌రావు, వదిన సుభవూదమ్మ, బాలకిషన్‌రావులు ఇంకా చింతమడకలో జీవిస్తున్నారు. కేసీఆర్‌పై ఇటీవల కొన్ని పత్రికల్లో వస్తున్న దుష్ర్పచారంతో కూడిన వార్తలతో వారు కలత చెందుతున్నారు. ఈ దుష్ర్పచారాలకు ఆధారాలేంటని వారు ప్రశ్నిస్తున్నారు. రాఘవరావు తనకు వచ్చిన డబ్బులతో చింతమడకలో తన బంధువైన రంగారావు వద్ద దాదాపు వంద ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాడని, అప్పటి నుంచి ఇక్కడే ఉంటూ వ్యవసాయం చేసుకునేవాడన్నారు. కేసీఆర్ ఇక్కడే జన్మించారని తెలిపారు. తమకు తెలిసినంత వరకు దాదాపు పది తరాలుగా కేసీఆర్ పూర్వీకులు మోహినికుంటలోనే ఉన్నట్టు తెలుస్తోందన్నారు.

చంద్రబాబు సాక్షిగా ఉద్యమ నేత దాతృత్వం

కేసీఆర్ ఎమ్మెల్యే అయ్యాక తన స్వగ్రామంలో ఉన్న ఇల్లును, ఖాళీ స్థలాన్ని చింతమడక ప్రభుత్వ స్కూలుకు విరాళంగా ఇచ్చారు. తాను పుట్టి పెరిగిన సొంత అర ఎకరంలో ఉన్న ఇంటిని ఆ ఊరి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు ఇచ్చేశారు. అదే విధంగా సుమారు ఐదు ఎకరాల ఖాళీ స్థలాన్ని సైతం పాఠశాలకు దానంగా ఇచ్చేశారు. తన ఇంటిని పాఠశాలకు ఇవ్వడం, ఆ పాఠశాలను అప్పుడు ముఖ్యమంవూతిగా ఉన్న చంద్రబాబునాయుడే ప్రారంభించడం విశేషం.

అతిపెద్ద గడి..

కోనాపూర్ గ్రామంలో ఉన్న అతిపెద్ద గడి ఇప్పటికీ ఉంది. రాఘవరావు వెళ్లిపోయాక రాఘవరావు మామ గునుకంటి రంగారావుకు చెందిన పాలొళ్లు ఇంటిలో నివసించారు. ఇందులో కొంత భాగంలో ఆ గ్రామానికి చెందిన అంజయ్య అనే వ్యక్తి నివసిస్తుండగా.. కొంత భాగంలో పొరుగు ఊరికి చెందిన వారు అద్దెకు ఉంటున్నారు. ఈ గడి ముందు పెద్ద బురుజుకూడా ఉంది. అందులో చెట్లు పెరగడంతో కొంత కూలిపోయింది.

పదో సంతానం కేసీఆర్

కేసీఆర్ తండ్రి రాఘవరావుకు మొత్తం పదకొండుమంది సంతానం. ఇందులో 9 మంది అడపిల్లలు కాగా.. ఇద్దరు మగసంతానం. ఇందులో కేసీఅర్ 10వ సంతానం. కేసీఆర్‌కు ముందుగా కమల, విమల, లలిత, నీలవతి, సకలమ్మ, జయ, రంగారావు, లక్ష్మీబాయి, సుమతి తదుపరి కేసీఆర్ 17-2-1953లో జన్మించారు. ఆయన తదుపరి వినోద అనే అమ్మాయి జన్మించింది. అయితే సుమారు నలుగురు కుమ్తాల వివాహాన్ని కేసీఆర్ తండ్రి రాఘవరావు కోనాపూర్‌లోనే చేసినట్లు ఆయన వద్ద పాలేరుగా పనిచేసిన మాజీ సర్పంచ్ అరుట్ల బాలరాజు తెలిపారు.

[నమస్తే తెలంగాణ నుండి]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *