తెరాస మలేషియా శాఖ ఆవిర్భావం

  • April 30, 2018 11:24 am

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బీగల గారి ఆధ్వర్యంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు కల్వకుంట్ల కవిత గారి చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర సమితి మలేషియా శాఖ ఏర్పాటయింది. ప్రస్తుతానికి పది మందితో అడ్‌హక్‌ పార్టీ కమిటీని ఏర్పాటు చేసారు. త్వరలోనే పూర్తిస్థాయి పార్టీ కమిటీని ఏర్పాటు చేస్తామని మహేష్ బీగల తెలిపారు. ఈ శాఖ ఆవిర్భావ ఏర్పాటుకు ఆకుల శ్యామ్ బాబు (డెన్మార్క్) ప్రత్యేక కృషి చేసారని మహేష్ బిగాల తెలిపారు.

ప్రస్తుతానికి చిట్టి బాబు చిరుత, కుర్మ మారుతి, గుండ వెంకటేశ్వర్లు, బొడ్డు తిరుపతి, గౌరు రమేష్, బోయిని శ్రీనివాస్, తిప్పర్తి అరుణ్ కుమార్, సుంకపెల్లి సుమన్ లతో కూడిన తాత్కాలిక కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.


Connect with us

Videos

MORE

Telugu

MORE

Featured

MORE