సూర్యాపేట సమరభేరిలో దేశపతి శ్రీనివాస్ ప్రసంగం :
సాధారణంగా ప్రజారాజ్యం కావాలని జైలుకు పోతారు. కానీ.. ప్రజల సొమ్ము దోచుకుని జైలుకు వెళ్లిన ఘనత జగన్‌ది. జైలులో పడిన కొడుకు పేరు చెప్పుకుని విజయమ్మ ఓట్లు అడుగుతున్నారు. కొడుకును నడుముకు కట్టుకుని ఆరుట్ల కమలమ్మ పోరాడిన ఘనత మనది.
కరుణామయుడు సినిమాలో యేసు ప్రభువు.. నా కోసం ఏడవకండి. మీ కోసం, మీ పిల్లల కోసం ఎడవండి అన్నారు. విజయమ్మ మాత్రం నా కోసం, నా కొడుకు కోసం, నా కూతురు కోసం ఏడవాలని అంటున్నారు. మరి తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసిన వెయ్యి మంది అమర వీరుల కోసం ఏడవమని ఎందుకు చెప్పరు?
ఫొటో: సూర్యాపేట సమరభేరిలో ఉప్పొంగిన జనసంద్రం
ఉస్మానియా క్యాంపస్‌లో అమరులైన శ్రీకాంత్‌చారి, సంతోష్, వేణుగోపాలరెడ్డి తల్లుల దుఖం విజయమ్మకు ఉండదు. జగన్ జైలుకు వెళ్తూ రెండు వేళ్లు చూపారు. ఎవరికీ అర్థంకాలేదు. నేను లక్ష కోట్లు కాదు.. రెండు లక్షల కోట్లు సంపాదించానని చెప్పేందుకే అలా రెండు వేళ్లు చూపుతున్నారు.
జగన్ పార్టీలో చేరేవారంతా జఫ్పాలే. ఇప్పటినుండి జఫ్ఫా అంటే జగన్ ఫాలోయర్లు అని గుర్తుంచుకోండి. తెలంగాణలో పాదయాత్ర చేసే వారు ఈప్రాత్నానికి రావల్సిన కృష్ణా, గోదావరి నీరు గురించి చెప్పరు ఎందుకు?
షర్మిల జగన్ వదిలిన బాణం కాదు. తెలంగాణపై వదిలిన బాణామతి. చంద్రబాబు 9ఏళ్లు దోచుకుంటే.. నేను నాలుగేళ్లు దోచుకోవద్దా? అని వైఎస్ అన్నారు. నీకు రెండు పత్రికలుంటే.. నాకు ఒక పత్రిక వద్దా.. అంటూ చంద్రబాబు, వైఎస్ పోటీపడ్డారు. అసెంబ్లీలో చంద్రబాబు అవిశ్వాసం పెట్టి.. రెండు గంటలు తిట్టుకుని తెలంగాణ మాట ఎత్తలేదు. తెలంగాణను వైఎస్, చంద్రబాబులే సర్వనాశనం చేశారు.
తెలంగాణను ఇంకా కేసీఅర్ తెస్తలేడు ఎందుకు అని మోత్కుపల్లి, అడుగుతున్నడు. అయ్యా మోత్కుపల్లీ, వచ్చిన తెలంగాణను మీ చంద్రబాబు, జగన్ కలిసి అడ్డుకున్నారు. నువ్వు మర్చిపోయినవేమో కానీ తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు.