mt_logo

ఇప్పుడు తలకాయలెక్కడ పెట్టుకుంటారు సీమాంధ్ర గోబెల్సూ?

మొదటి సంవత్సరం ఫలితాలపై సీమాంధ్ర మీడియా కారుకూతలకు జవాబు ఇక్కడ: ఇంటర్ ఉత్తీర్ణతపై సీమాంధ్ర మీడియా విషప్రచారం

ఇంటర్ మొదటి సంవత్సర  ఫలితాల్లో తెలంగాణ వెనకబడిందని, దానికి కారణం సకలజనుల సమ్మెనే అని దొంగప్రచారానికి దిగిన సీమాంధ్ర మీడియా, నిన్న ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాలు వచ్చినప్పుడు మాత్రం తేలుకుట్టిన దొంగల్లా నోరుమెదపట్లేదు.

అటు చివర ఉన్న శ్రీకాకుళం నుండి ఇటు చివర ఉన్న చిత్తూరు వరకూ అన్ని సీమాంధ్ర జిల్లాల్లోనూ 2011తో పోలిస్తే ఈసారి ఇంటర్ రెండో సంవత్సరంలో ఉత్తీర్ణత శాతం తగ్గింది. రెండు రోజులు గడవక ముందే తాము ఆడిన పచ్చి అబద్ధం బట్టబయలయ్యేసరికి ఒక్క మీడియా సంస్థ కూడా కిక్కురుమనట్లేదు.

పట్టిక: క్రితం సారితో పోలిస్తే ఉత్తీర్ణత తగ్గిన జిల్లాలు ఎరుపులో, ఉత్తీర్ణత పెరిగిన జిల్లాలు ఆకుపచ్చ రంగులో, గత సంవత్సరంతో సమానంగా ఉన్న జిల్లాలు నారింజ రంగులో ఉన్నాయి

విశేషమేమిటంటే రాష్ట్రం మొత్తం మీద గత యేడాది కంటే మెరుగైన ఉత్తీర్ణత శాతం నమోదు చేసిన రెండు జిల్లాలు (ఖమ్మం, నల్లగొండ) తెలంగాణలోనే ఉండటం.

ప్రతి యేడాది వివిధ జిల్లాల్లో పదో తరగతి, ఇంటర్ ఫలితాలు హెచ్చుతగ్గులు లోనవడం సర్వసాధారణం. ఒక్కో సబ్జెక్ట్ ప్రశ్నా పత్రం కూర్పు, జవాబు పత్రాలు దిద్దిన విధానం, ఆయా జిల్లాల్లోని కళాశాలల్లోమౌలిక సౌకర్యాలు – ఇలా రకరకాల కారణాల వల్ల ఈ హెచ్చుతగ్గులు నమోదు అవుతాయి. ఇంత చిన్న విషయాన్ని కూడా తెలంగాణపై విషం గక్కడానికి వాడుకుని తమ కుత్సిత బుద్ధిని మరోసారి ప్రదర్శించుకున్నాయి సీమాంధ్ర మీడియా సంస్థలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *