ఆటా తెలంగాణ న్యాయ సహాయం..

  • February 5, 2019 2:09 pm

అమెరికాలో నకిలీ యూనివర్సిటీ కుంభకోణంలో అరెస్ట్ అయిన తెలుగు విద్యార్థులను కాపాడేందుకు అమెరికా తెలంగాణ అసోసియేషన్(ఆటా) కృషి చేస్తున విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అమెరికాలోదర్యాప్తు ఎదుర్కొంటున్న విద్యార్ధులకు విముక్తి కలిగించేందుకు ఆటా తన కార్యాచరణను మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే పలువురు విద్యార్థులకు అటార్నీలను నియమించి వారి తరపున వాదనలు వినిపిస్తున్న ఆటా తెలంగాణ తాజాగా విద్యార్థులను కస్టడీ నుండి విడిపించేందుకు నేరుగా డిటెయిన్ సెంటర్ల వద్దకు వెళ్ళింది.

అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ వెంకట్ మంతెన మిచిగాన్ లోని థియెడర్ స్టేట్స్ కోర్ట్ హౌస్ వద్ద ఫెడరల్ క్రిమినల్ అటార్నీ ఎడ్వర్డ్ భజోకాతో సమావేశమయ్యారు. విద్యార్థుల తరపున వాదిస్తున్న ఎడ్వర్డ్ తో సమావేశం సందర్భంగా కస్టడీలో ఉన్న వారిని విముక్తి చేసేందుకు సత్వరం ప్రభుత్వం చర్యలు తీసుకునేలా చూడాలని ఎడ్వర్డ్ ను వెంకట్ మంతెన అభ్యర్ధించారు.


Connect with us

Videos

MORE