ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తెలంగాణ!!

  • September 18, 2020 12:35 pm

రాష్ట్ర ఆవిర్భావానికి ముందు తెలంగాణలో ఫ్లోరైడ్ పీడిత గ్రామాలు 967 ఉండేవి. మిషన్ భగీరథను విజయవంతంగా అమలు చేయడంతో ఇవాళ రాష్ట్రంలో ఫ్లోరైడ్ పీడిత గ్రామాలు లేవని కేంద్రమే తెలిపింది అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ బృందానికి కేటీఆర్ అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణలోని అనేక పల్లెలను ఫ్లోరైడ్ భూతం పట్టి పీడించిన విషయం తెలిసిందే. అనేక పోరాటాలు చేసినా, ఢిల్లీ వెళ్ళి కేంద్రాన్ని నిలదీసినా అప్పటి ప్రభుత్వాల్లో చలనం లేదు. కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చలేదు.

తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకం ద్వారా ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రజలకు సురక్షిత తాగునీరు అందించాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ ద్వారా గోదావరి, కృష్ణా జలాలను ఇంటింటికీ తీసుకొచ్చి అందిస్తున్నారు. మిషన్ భగీరథ పథకం వల్లే తెలంగాణలో ఫ్లోరైడ్ పీడిత గ్రామాలు లేవంటూ కేంద్రమే స్పష్టం చేసింది.

 


Connect with us

Videos

MORE