mt_logo

కేటీఆర్ సార్… మీది గోల్డెన్ హార్ట్ : బెంగుళూర్ వాసి ట్వీట్

బెంగుళూరువాసి ఒకరు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ను ‘మీది గోల్డెన్ హార్ట్’ అని కొనియాడుతూ ట్వీట్ చేశాడు. వివరాల్లోకి వెళితే… ఆరోగ్య పరమైన సమస్యలు, ప్రజా సమస్యలపై ట్విట్టర్లో వచ్చే ఫిర్యాదులపై మంత్రి కేటీఆర్ తక్షణమే స్పందిస్తుంటారు. చిన్న పిల్లలు నుండి పెద్దల వరకు ఎలాంటి శస్త్రచికిత్స, వైద్య సాయం కావాలన్న కేటీఆర్ కార్యాలయం నుంచి వెనువెంటనే అవసరమైన సాయం అందిస్తుంటారు. దీనిపై బెంగళూరుకు చెందిన వెంకట్ అనే వ్యక్తి ‘మీది బంగారం లాంటి మనసు. ప్రజలను, పిల్లలను ఎనలేని ప్రేమతో కాపాడుతూ ఉంటారు. దేవుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలి. మీరు దేవుడిలా చిరకాలం జీవించాలి సోదరా’ అని ట్వీట్ చేశారు. కాగా ఈ ట్వీట్ పై స్పందించిన మంత్రి కేటీఆర్… ‘మనలో ఎవరూ శాశ్వతంగా ఇక్కడే ఉండరు. మనకు ఇతరులకు సాయం చేయగల సామర్థ్యం ఉన్నా సెల్ఫ్ లైఫ్ లో అది పరిమితమే. ఏదో నా శక్తి కొద్ది సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నా… అంతే. మీ మంచి మాటలకు ధన్యవాదాలు సోదరా’ అని రీట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *