బతుకమ్మ కోసం విదేశాల నుండి పూలు సేకరించిన మహిళ

  • October 14, 2021 1:17 pm

దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి తీసుకువచ్చిన తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చింది హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళ. కూకట్‌పల్లికి చెందిన గుండాల అర్చన మరియు ఆమె అత్త చంద్రమ్మ ప్రతి ఏటా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి, వివిధ రాష్ట్రాల నుండి బతుకమ్మ కోసం లక్షల్లో ఖర్చు చేసి అనేక రకాల పువ్వులు తెప్పించేవారు. ఈసారి దేశంలోని కాశ్మీర్,కన్యాకుమారి, కొడైకెనాల్,ఊటీ, బెంగళూర్ వంటి నగరాల నుండే కాకుండా న్యూజిలాండ్ లోని తన స్నేహితుల ద్వారా ప్రత్యేకమైన పూలను పార్శిల్‌లో తెప్పించారు. దాదాపు నెలరోజుల పాటు సేకరించిన ఈ పూలతో పదమూడు అడుగుల చూడముచ్చటైన బతుకమ్మను అందంగా పేర్చి, బుధవారం సద్దుల బతుకమ్మ ఆడిపాడారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి మేళతాళాలు, భారీ ర్యాలీతో ఐడీఎల్‌ చెరువు వద్దకు తీసుకెళ్ళి నిమజ్జనం చేశారు.


Connect with us

Videos

MORE