mt_logo

పిలవని పేరంటానికి వెళ్ళిన లగడపాటి!

శుక్రవారం జరిగిన ఏఐసీసీ సదస్సుకు ఆహ్వానం లేకపోయినా వెళ్ళి సమైక్యవాదం వినిపిస్తున్న లగడపాటిని తెలంగాణ నేతలు జై తెలంగాణ నినాదంతో అడ్డుకున్నారు. ఏఐసీసీ ముఖ్య నేతలు ప్రసంగిస్తున్న సమయంలో జై సమైక్యాంధ్ర మా నినాదం, సమైక్యాంధ్ర మా విధానం అని ఉన్న బ్యానర్ ను పట్టుకుని లగడపాటి, హర్షకుమార్ నినాదాలు చేశారు. వెంటనే సేవాదళ్ వాలంటీర్లు వారిద్దరినీ అక్కడినుంచి పంపివేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేదికి ఫోన్ చేసి వారికి పాసులు ఇప్పించినట్లు సమాచారం. ఆహ్వానం లేకపోయినా సమావేశానికి వచ్చి గోల చేయడం అవివేకమని, సీమాంధ్ర నేతలు దొంగవ్యాపారాలు చేస్తూ పార్టీని, ప్రజలను మభ్యపెడుతున్నారని ఎంపీలు మధుయాష్కీ గౌడ్, పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, అసెంబ్లీ సమావేశాలను 23వ తేదీనే ముగిస్తారని, ఒక్క గంట కూడా పొడిగించరని తెలిసింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కేవీపీ, బొత్స సత్యనారాయణ, సీ. రామచంద్రయ్య, కొండ్రు మురళి, షబ్బీర్ అలీ, పొంగులేటి, నంది ఎల్లయ్య, బొత్స ఝాన్సీ తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *