mt_logo

షరతులతో కూడిన తెలంగాణ వద్దు-కేసీఆర్

ఆంక్షలు   లేని తెలంగాణ కావాలని, షరతులతో కూడిన తెలంగాణ ఇచ్చినా ప్రయోజనం లేదని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ స్పష్టం చేసారు. తెలంగాణ బిల్లులో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని, వాటిని సవరిస్తూ ఆంక్షలు లేని తెలంగాణ మాత్రమే ఇవ్వాలని ప్రధానమంత్రికి ఒక లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఆయన కేకే, టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు జగదీష్ రెడ్డితో కలిసి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి తెలంగాణ బిల్లుపై చర్చించారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ళు, నిధులు, నియామకాల కేటాయింపులో జరిగే అన్యాయాన్ని ఎదిరించడానికని, ఆంధ్ర ప్రాంతంలో అనేక ప్రాజెక్టులు కట్టారు కానీ తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టాలంటే మాత్రం జలబోర్డుల చుట్టూ తిరగడం కానిపని అని, బిల్లులో గోదావరి, కృష్ణా నదులపై బోర్డులు ఏర్పాటు చేస్తామని ఉందని, ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేదిలేదని కేసీఆర్ భావించినట్లు సమాచారం. ఇన్నేళ్ళబట్టి ఉద్యోగాల విషయంలో అన్యాయం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చాకకూడా అక్రమంగా ఉద్యోగం పొందిన సీమాంధ్రులకు పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఆ విషయం సీమాంధ్ర ప్రాంతమే చూసుకోవాలని కేసీఆర్ ప్రధానికి రాసే లేఖలో వివరించనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన కేసీఆర్ డిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారని, 5నుండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *