mt_logo

ఉద్యమంలా దళితబంధు : సీఎం కేసీఆర్

ప్లీనరీ సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ..ఉద్యమంలా దళిత బంధు అమలుచేస్తున్నామని, కేవలం దీనితోనే ఆగిపోదని భవిష్యత్తులో మరిన్నీ కార్యక్రమాలు చేప‌డుతామ‌న్నారు. ద‌ళిత బంధు రాష్ట్ర ఆర్థిక పురోగ‌తికి తోడ్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. వీఆర్‌ఓ వ్యవస్థకు బదులు ధరణి తీసుకొచ్చామని, రాష్ట్రంలో అద్భుతాలను ఆవిష్కరిస్తున్నామన్నారు. 30కోట్ల టన్నుల వరి ఉత్పత్తి చేసి రికార్డు సాధించామని, విద్యుత్‌ తలసరి వినియోగంలో నెం.1 గా తెలంగాణ నిలవడం గర్వకారణమని తెలిపారు. 11.5 ఆర్థిక వృద్ధితో దేశంలో ముందంజలో దూసుకుపోతున్నామని, సాగునీటి రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చామని, అందరి సహకారంతోనే రాష్ట్రాభివృద్ధి జరిగినట్లు పేర్కొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడిల వెల్లువలా వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కుల, మతాలకు అతీతంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ ముం‍దుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో తెలంగాణ ప‌థ‌కాలు ఆదర్శంగా నిలిచాయని అన్నారు. దేశం కంటే తెలంగాణ రాష్ట్రం ముందుందని చెప్పారు.

* టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో 7 తీర్మానాలను ప్రవేశపెట్టనున్న నేతలు *

* అధ్యక్షులకు అభినందనపై తొలి తీర్మానం.. టీఆర్‌ఎస్‌ విజయాలు,ఆవిష్కరణలు, సాగునీరు
* గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పరిపుష్టిపై రెండో తీర్మానం
* సంక్షేమ తెలంగాణ సాకారంపై మూడో తీర్మానం.. పరిపాలనా సంస్కరణలు, విద్యుత్‌ రంగాభివృద్ధి
* ఐటీ రంగం అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై నాలుగో తీర్మానం
* దేశానికే దిక్సూచి దళిత బంధుపై ఐదో తీర్మానం
* విద్య, వైద్య రంగాల అభివృద్ధిపై ఆరో తీర్మానం
* కేంద్ర ప్రభుత్వానికి టీఆర్‌ఎస్‌ వివిధ డిమాండ్లపై ఏడో తీర్మానం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *