ప్రజలను, రైతులను ప్రతిపక్షాలు మభ్య పెడుతున్నాయని, ఏపీ కంటే తెలంగాణలోనే ఎక్కువ విద్యుత్ ఇస్తున్నామని భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. రైతులకు సరిపడా విద్యుత్ ఇవ్వడమే తమ లక్ష్యమని, బహిరంగ మార్కెట్ లో ఎంత విద్యుత్ దొరికితే అంత కొంటున్నామన్నారు.
ఇదిలాఉండగా సోలార్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు భారీ స్పందన వచ్చిందని టీఎస్పీడీసీఎల్(tspdcl) ప్రకటించింది. ఈ సందర్భంగా టీఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి మాట్లాడుతూ, 500 మెగావాట్లకు బిడ్లు ఆహ్వానించామని, బిడ్లు వేసేందుకు 108 మంది ముందుకొచ్చారని అన్నారు. 1893 మెగావాట్ల ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు చాలామంది సిద్ధంగా ఉన్నారని, సౌర కేంద్రాల ఏర్పాటుకు నెలలో బిడ్లు ఖరారు చేస్తామని ఆయన తెలిపారు.