వాటర్ గ్రిడ్ పథకానికి ప్రభుత్వం ఇప్పటికే ఈ ఏడాది బడ్జెట్ లో 2వేల కోట్ల రూపాయలను కేటాయించగా మరో 5వేల కోట్ల రూపాయల రుణాన్ని హడ్కో ద్వారా సేకరించాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పనులు మరింత వేగంగా జరగనున్నాయి. వాటర్ గ్రిడ్ పనుల పురోగతి ఆధారంగా వివిధ దశల్లో ఈ రుణ మొత్తాన్ని అందిస్తామని హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(హడ్కో) అంగీకరించింది.
గ్రిడ్ పనులను పర్యవేక్షించడానికి వీలుగా వాటర్ గ్రిడ్ కార్పొరేషన్ ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపిన వాటర్ గ్రిడ్ కార్పొరేషన్ ఫైలు ప్రస్తుతం న్యాయశాఖ వద్ద ఉంది. ఒకట్రెండు రోజుల్లో అనుమతి లభించగానే కార్పొరేషన్ ను ప్రభుత్వం ప్రకటించనుంది.