ఆఫ్రికా ఖండంలోనే ఎత్తైన కిలిమంజారో పర్వతంపై జాతీయ జెండా రెపరెపలాడింది!.. వరంగల్ జిల్లాకు చెందిన అఖిల్ రసమల్ల కిలిమంజారో పర్వతం అధిరోహించి అక్కడ జాతీయ జెండాతో పాటు ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు చిత్రపటాన్ని ఉంచాడు. వరంగల్ కు చెందిన ప్రముఖ సామాజికవేత్త చిలువేరు శంకర్ మొదటినుండి రసమల్ల అఖిల్ కు సహాయసహకారాలు అందించడం విశేషం.
ఈ సందర్భంగా ఆఫ్రికా ఖండంలోని ప్రవాస తెలంగాణవాసులు అఖిల్ కు శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ టాంజానియా అధ్యక్షుడు వంగ నరసింహారెడ్డి, ఉపాధ్యక్షుడు బొల్లకపల్లి నంద కిషోర్, సభ్యులు మకల ప్రవీణ్ చంద్ర, కుశలవ్ రెడ్డి, కల్చరల్ అసోసియేషన్ చైర్మన్ పిట్టల సత్యనారాయణ, సెక్రెటరీ శ్రీనివాస్ సిరిపురం, కల్చరల్ సెక్రటరీ నాగరాజు, సభ్యులు సైదులు, దాస్యం శేషురావు, గుడికందుల దయాకర్ చారి, గోవింద్ రెడ్డి, భూషణ్ రెడ్డి, అనిల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి పర్వతారోహణ ఎట్లా జరిగిందో అఖిల్ ను అడిగి తెలుసుకుని ప్రశంసించారు. టీఆర్ఎస్ సౌతాఫ్రికా శాఖ అధ్యక్షుడు నాగరాజు గుర్రాల, మల్లికార్జున్ రెడ్డి నన్నూరి మరియు కిరణ్ కుమార్ బెల్లి కూడా అఖిల్ తో మాట్లాడి అభినందనలు తెలిపారు.