mt_logo

ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన సర్వే సత్యనారాయణ!

వరంగల్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి, సీనియర్ నేత సర్వే సత్యనారాయణ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. వరంగల్ లోక్ సభ స్థానానికి ఇవాళ పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్ళి ఓటర్లను కలుస్తూ తనకు ఓటు వేయాలని సర్వే సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. మాజీ ఎంపీ అయి ఉండి కూడా ఎన్నికల నియమావళి తెలియనట్లు ప్రవర్తించిన సర్వే సత్యనారాయణ తీరుపై పలువురు మండిపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *