సీమాంధ్రలో అల్లరిమూకలు “సమైక్య ఉద్యమం” ముసుగులో రెచ్చిపోతున్నాయి. ప్రభుత్వ ఆస్తులే కాకుండా తమ రాజకీయ ప్రత్యర్ధుల ప్రైవేటు ఆస్తులు కూడా యధేచ్చగా దహనం చేస్తున్నారు. షాపులను లూటీలు కూడా చేస్తున్నారు.
విజయనగరంలో ఇవ్వాళ కూడా బొత్స కుటుంబమే టార్గెట్ గా ఆందోళనలు జరిగాయి. కోట జంక్షన్ లో పలు భవంతులు అల్లరిమూకల దాడుల్లో ధ్వంసం అయినయి.
అల్లరిమూకలు డీసీసీబీ బ్యాంకును తగులబెట్టడంతో పాటు ఒక వైన్ షాపు లూటీ చేయడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.
ఈ విధ్వంసాన్ని నివారించడానికి ప్రయత్నిస్తున్న పోలీసుల మీద కూడా అల్లరిమూకలు దాడిచేయడంతో పలువురు పోలీసులకు గాయాలు అయినయి.
టియర్ గ్యాస్ ప్రయోగించినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఇవ్వాళ సాయంత్రం నుండి విజయనగరంలో కర్ఫ్యూ విధించారు.
పరిస్థితిని అదుపు చేయడానికి విజయనగరానికి అదనపు బలగాలు పంపుతున్నారు.