సీమాంధ్ర నాయకుల పిచ్చి పీక్ స్టేజికి చేరుకున్నట్టుంది. సీమాంధ్రను ప్రత్యేకమైన దేశమైనా చేయండి లేదా అమెరికాలో 51వ రాష్ట్రమైన చేయండి అంటున్న ఈ తెదేపా నాయకుడి తీరు చూడండి:
—
సీమాంధ్ర 13 జిల్లాలను ఆంధ్రప్రదేశ్ అనే ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని నూజివీడు తెలుగుదేశం పార్టీ నాయకుడు, రాష్ట్ర తెలుగు యువత ప్రచార కార్యదర్శి నూతక్కి వేణుగోపాలరావు డిమాండ్ చేశారు. శనివారం తెలుగుదేశం పార్టీ నిర్వహించిన పాదయాత్రలో భాగంగా నూజివీడు పట్టణంలో చారిత్రాత్మక ప్రదేశం అయిన 1913లో మహాత్మగాంధీ నూజివీడులో బస చేసిన స్మారకప్రదేశంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 13 జిల్లాల ప్రజల మనోభావాలకు కనీస గౌరవం ఇవ్వకుండా నియంతగా, పక్షపాతంతో వ్యవహరిస్తున్న ఈ కేంద్రప్రభుత్వ పాలన కింద తాము జీవించలేమని ఆయన స్పష్టం చేశారు.
ఒక భారతీయుడిగా ప్రత్యేక దేశంగా ఏర్పడాలని కోరుకోవడం బాధగా ఉన్నా, సీమాంధ్రప్రజల్లో చాలామందిలో ఇప్పుడు ఇదే అభిప్రాయం ఏర్పడుతోందన్నారు.
ప్రపంచ పెద్దన్నగా ఉన్న అమెరికా అధ్యక్షుడికి తమ సీమాంధ్ర ప్రజల పట్ల ఈ కేంద్రప్రభుత్వం చేస్తున్న అన్యాయంను ఆయన దృష్టికి తీసుకువెళ్ళి సీమాంధ్రకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, లేకపోతే మమ్ములను అమెరికాలో 51వ రాష్ట్రంగా కలుపుకోవాలని ఆ దేశ అధ్యక్షుడిని యువత కోరనున్నట్లు నూతక్కి వేణు తెలిపారు. సుదీర్ఘసముద్ర తీరం ఉంది, విడిపోయి బాగా అభివృద్ధి చెందవచ్చునని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. పార్లమెంట్ వెంటనే అనుమతి ఇచ్చి ఈ నూతన దేశవిభజనను పూర్తిచేస్తే మా వల్ల ఇబ్బంది మీకు ఉండదు, మీ దరిద్రం మాకు ఉండదన్నారు.
Courtesy: http://www.andhrajyothy.com