విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులకు సూచించారు. రాష్ట్రంలో విద్యుత్ లభించే శాతం ఎంత ఉంది? లోటు శాతం ఎంత ఉంది? అనే అంశాలపై సీఎం విద్యుత్ శాఖ అధికారులతో చర్చించారు. విద్యుత్ కొనుగోలుపై ఛత్తీస్ గడ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు నివేదిక సిద్ధం చేయాలని, అవసరమైతే తానే స్వయంగా ఛత్తీస్ గడ్ వెళ్లి అక్కడి ముఖ్యమంత్రితో విద్యుత్ కొనుగోలుపై చర్చిస్తానని స్పష్టం చేశారు.
అనంతరం క్లీన్ హైదరాబాద్ గా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని సీఎం అధికారులకు సూచించారు. చెత్త డంపింగ్ యార్డులను 12నుండి 15 వరకు ఏర్పాటు చేయాలని, డంప్ యార్డుల కోసం వెయ్యి ఎకరాల స్థలాన్ని సేకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గండిపేట, హిమాయత్ సాగర్ లలోకి కలుషిత నీరు చేరకుండా చూడాలని, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కేసీఆర్ పేర్కొన్నారు.