విభజనకు విలీనం అడ్డుకాదని, రాజ్యాంగ ప్రక్రియ ఆధారంగానే తెలంగాణ ఏర్పాటు జరుగుతుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ మంగళవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ తో టీఆర్ఎస్ విలీనం గురించి ప్రస్తావించగా, ఇలా అన్నారు.
“తెలంగాణ ఏర్పాటు రాజ్యాంగపరమైన వ్యవహారం. రాజకీయాలనూ, పాలనా వ్యవహారాలను ఒక్కటిగా చూడొద్దు. తెలంగాణ ఏర్పాటుకు అన్ని పార్టీలూ అంగీకరించి, సీడబ్ల్యూసీ ప్రకటన తర్వాత యూటర్న్ తీసుకున్నాయి. వేరే పార్టీలలాగా కాంగ్రెస్ తన మాటను వెనక్కి తీసుకోదని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని” స్పష్టం చేశారు.
సీమాంధ్ర ఎమ్మెల్యేలు తమ ప్రాంత సమస్యల గురించి అసెంబ్లీలో చర్చిస్తే మంచిదని చెప్పారు.
ఆఖరి బంతి ఇంకా మిగిలేఉందన్న కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై ఆయన ఇలా కౌంటర్ఇచ్చారు. “ఆఖరి బంతి ఎప్పుడు పడుతుందో క్రికెటర్ గా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కి తెలుసు” అని అన్నారు.