mt_logo

నిరుద్యోగులు ఇంకెన్నాళ్లు ఎదురు చూడాలి ? : ప్రధానిపై ధ్వజమెత్తిన వరుణ్ గాంధీ

రోజురోజుకి దేశంలో పెరుగుతున్న నిరుద్యోగంపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. సీఎంఐఈ తాజా నివేదికను ప్రస్తావిస్తూ.. యువకుల్లో ఉద్యోగిత రేటు ఐదేండ్ల కనిష్టానికి చేరిందని పేర్కొన్నారు. 2017లో 20.9 శాతంగా ఉన్న ఉద్యోగిత రేటు ప్రస్తుతం 10.4 శాతానికి పడిపోయిందని అన్నారు. ఉద్యోగాల కోసం దేశ యువత ఎన్నేండ్లు వేచిచూడాలని ప్రశ్నించారు. 10 లక్షల ఖాళీల భర్తీ చేపట్టాలని ప్రధాని మోదీ ఇటీవల ప్రభుత్వ శాఖలను కోరారని, అయితే ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదని వరుణ్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ(సీఎంఐఈ) ప్రకారం గత నెలలో 20 లక్షల మంది ఉపాధి కోల్పోయారని, అంటే ఆగస్టులో గరిష్ఠంగా 8.3 శాతం నిరుద్యోగిత రేటు నమోదైందన్నారు. జూలైలో 6.8%గా ఉన్న నిరుద్యోగిత రేటు ఆగస్టులో 8.3 శాతానికి పెరిగిందని ద్వజమెత్తారు. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 9.6 శాతానికి పెరగ్గా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా 7.7 శాతానికి చేరిందన్నారు. బీజేపీ పాలిత హర్యానాలో నిరుద్యోగిత రేటు అధికంగా 37.3 శాతం ఉండగా, తరువాతి స్థానాల్లో కశ్మీర్‌(32.8%), రాజస్థాన్‌ (31.4%) ఉన్నాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *