ఎస్సీ వర్గీకరణ కోసం, ఆత్మబలిదానాలపై మాదిగ జాతి మొత్తం వీరోచిత పోరాటం చేస్తే వారి త్యాగాలను సీమాంధ్ర పార్టీలకు తాకట్టు పెట్టి జాతికి తీరని ద్రోహం చేసిందెవరో ఆత్మ విమర్శ చేసుకోవాలని మందక్రిష్ణను ఉద్దేశించి ఎంఎస్ఎఫ్ రాష్ట్ర కో ఆర్డినేటర్ వంగపల్లి శ్రీనివాస్ అన్నారు.
దాదాపు రెండు దశాబ్దాలుగా చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల కనుసన్నల్లో మాదిగ ఉద్యమాన్ని నడిపి వారి రాజకీయ ప్రయోజనాల కోసం జాతిని విచ్చిన్నం చేసిన మందక్రిష్ణ ఇకనైనా తన వైఖరి మార్చుకోవాలని శ్రీనివాస్ సూచించారు.