mt_logo

వడ్డీలేని రుణాలను కొనసాగించేందుకు నిర్ణయం: మంత్రి కేటీఆర్

• మహిళా సాధికారికతకు కట్టుబడిన ప్రభుత్వం మాది
• సకాలంలో రుణ వాయిదాలు కట్టి వడ్డీలేని రుణాలను ఉపయోగించుకోవాలని సంఘాలకి పిలుపు
• బ్యాంకు రుణాల లింకేజీకి మరిన్ని చర్యలు

వడ్డీలేని రుణాలను కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు పంచాయితీ రాజ్ శాఖామంత్రి కే.తారక రామారావు తెలియజేశారు. ఈమేరకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని అయన తెలిపారు. మహిళా సాధికారతకి పెద్దపీట వేసేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే మహిళల కోసం కల్యాణలక్ష్మి లాంటి పథకాన్ని చేపట్టిన తమ ప్రభుత్వం భవిష్యత్ లోనూ మహిళల కోసం మరిన్ని పథకాలు చేపడుతుందని తెలిపారు.

ఈ వడ్డీలేని రుణాల కోసం 2014-15 అర్ధిక సంవత్సరానికి 485.44 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం 2013-14 సంవత్సరానికి 344.66 కోట్లు మాత్రమే ఈ కార్యక్రమానికి విడుదల చేస్తే తాము మాత్రం 485 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సుమారుగా మూడు లక్షల స్వయంసహాయ సంఘాలకి ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 30 లక్షల మహిళలు లబ్ధి పొందుతారన్నారు. జీవనోపాధి కోసం స్వశక్తితో ఉపాధి కల్పించుకుంటున్న స్వయంసహాయక సంఘాల్లోని మహిళలకి ఆర్ధిక భారం తగ్గుతుందని తెలిపారు. వడ్డీలేని రుణాలను కొనసాగిండం వల్ల స్వయంసహాయక సంఘాలు బ్యాంకుల వద్ద తీసుకున్న మొత్తం రుణాలకి పూర్తి వడ్డీ భారం తొలగిపోతుందన్నారు. మొత్తం సుమారు 4.15 స్వయంసహాయక సంఘాలుంటే సకాలంలో రుణ వాయిదాలు కడుతున్న సుమారు 70(3లక్షల) శాతం సంఘాలకి వడ్డీలేని రుణాల పథకం వర్తిస్తున్నదన్నారు. నవంబర్ నెలాఖరు నాటికి మొత్తం సంఘాల రుణాల మెత్తం 5,921 కోట్ల రూపాయలున్నట్లు తెలిపారు. మొత్తం స్వయంసహాయక సంఘాలన్నీ సకాలంలో వాయిదాలు కట్టుకుని వడ్డీ భారం తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పథకంలో స్వయంసహాయక సంఘాలన్నీ సకాలంలో వాయిదాలు కట్టుకుని వడ్డీ భారం తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. గడువులోపల వాయిదాలు కట్టిన సంఘాల అకౌంట్లకి నేరుగా ఈ వడ్డీని జమ చేస్తామన్నారు. ఈ పథకానికి అవసరమయ్యే పూర్తి భారాన్ని భరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారాన్ని అందిస్తున్నందున స్వయం సహాయక సంఘాలకి బ్యాంకు రుణాల లింకేజీ పెరుగుతుందన్న అశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో సెర్ఫ్ సీఈవో మురళి, మంత్రి కే.తారక రామారావుని అయన నివాసంలో కలసి పథకం తాలూకు వివరాలను, పనితీరును వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *